ఏపీ దివాళా తీస్తుందట.. చంద్రబాబు శాపాలు!

Tap to expand
ఆంధ్రప్రదేశ్ దివాళా తీస్తుందని అంటున్నారు.. ఈ మాట అన్నది ఎవరో అయితే అది వేరే కథ. రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాల పాటు సీఎంగా చేసినట్టుగా ఘనంగా ప్రకటించుకున్న వ్యక్తి విభజత ఏపీని తన దుబారాతో గుల్ల చేసిన వ్యక్తిగా పేర్గాంచిన చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

చంద్రబాబు నాయుడి గత ఐదేళ్ల పాలన కాలంలోనే అక్షరాలా రెండు లక్షల కోట్ల రూపాయలపై చిలుకు అప్పులను చేశారు. అలా చేసిన అప్పులతో సంపదను సృష్టించే ప్రయత్నాలూ జరగలేదు. అప్పులను తెచ్చి పప్పుబెల్లాలను పంచి తన పార్టీ వారి జేబులు నింపడానికి నీరు చెట్టు ప్రోగ్రామ్ లను పెట్టిన ఘనత చంద్రబాబుది. ప్రతి దాంట్లోనూ జన్మభూమి కమిటీల జోక్యంతో అప్పుడు ఖజానాను ఖాళీ చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కింది.

ఆఖరికి చంద్రబాబు జమానాలో ఆర్థిక మంత్రిగా చేసిన యనమల ఇటీవలే మాట్లాడుతూ.. ఏపీకి కొత్తగా అప్పులు దొరికే పరిస్థితి కూడా లేదని సెలవిచ్చారు. అన్ని మార్గాల్లోనూ తాము అప్పులు చేసేశామని ఆయన తేల్చారు. ఇక చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికి ఏపీ ఖజనాలో మిగిలింది యాభై కోట్ల రూపాయల మొత్తమే అంటూ ఆయన అనుకూల మీడియానే ఒక కథనాన్ని ఇచ్చింది.

అదీ చంద్రబాబునాయుడి పాలనలోని బ్యాలెన్స్ షీట్. ఆ స్థాయిలో ఖజనాను గుల్ల  చేసిన ముఖ్యమంత్రిగా ఖ్యాతిని కలిగి ఉన్న చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రం దివాళా తీస్తుందని శాపనార్థాలు పెడుతూ ఉన్నారు.

ఒకవైపు జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా చంద్రబాబు నాయుడు హయాం నాటి ఒప్పందాలను సవరిస్తూ ఉంది. ఖజానపై ఎంతో కొంత మీద భారం తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు.. తన పార్టీ వాళ్లపై దాడులు జరుగుతున్నాయని రాష్ట్రం దివాళా తీస్తుందని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
Show comments