ఐష్ పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఫోటో!

Tap to expand
కొన్ని ఫోటోల్ని చూడగానే పిక్చర్ పర్ఫెక్ట్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేయాలనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో అలాంటిదే. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫోటో ఇది. అందునా మాజీ విశ్వసుందరి ఆ ఫ్రేమ్ లో ఉండడంతో ఆ ఫోటోకే అందం ఆటోమెటిగ్గా వచ్చేసింది.

భర్త అభిషేక్ బచ్చన్.. కూతురు ఆరాధ్య బచ్చన్ లతో కలిసి ఐష్ రెడ్ డ్రెస్ లో ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తోంది. అభిషేక్ చూడటానికి జమీందార్ లా కనిపిస్తుంటే.. ఐష్ కూడా జమీన్ వైఫ్ లానే ఎంతో లగ్జరస్ గా ట్రెడిషనల్ గా కనిపిస్తోంది. ఆ ఇద్దరి మధ్యా ఆరాధ్య లవ్ లీ ఎక్స్ ప్రెషన్ మైమరిపిస్తోంది.

ఇక బ్యాక్ డ్రాప్ లో ఆ ఫోటో ఫ్రేములు అంతే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అమ్మవారి ఫోటోలతో ఎంతో ప్రత్యేక శోభను సంతరించుకుంది ఆ బ్యాక్ గ్రౌండ్. ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ షాప్ లో ఇలా ఫోటో దిగారా?  లేక ఎక్కడైనా గుడికి వెళ్లారా? అన్నది అర్థం కావడం లేదు కానీ.. పిక్చర్ పెర్ఫెక్ట్ అని పొగిడేయకుండా ఉండలేం. అన్నట్టు టాలీవుడ్ లో అక్కినేని మల్టీస్టారర్ మనం తరహాలో బిగ్ బి ఫ్యామిలీ సినిమా ఎప్పుడో? అమితాబ్-అభిషేక్-జయాబచ్చన్-ఐష్ -ఆరాధ్య కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే చూడాలన్నది ఫ్యాన్స్ ఆశ. పెద్దతెరపై బచ్చన్ల మనం ఎప్పుడొస్తుందో ఏమిటో!!


Show comments