వైసీపీ లో లోకేశ్ నిక్ నేమ్ ఏంటో చెప్పేసిన కొడాలి నాని

Tap to expand

జగన్‌ చిటికెస్తే చంద్రబాబు నాయుడికి ఇప్పటివరకు ఉన్న ప్రతిపక్ష హోదా కూడా పోతుందని ఏపీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించింది చంద్రబాబేనని.. ఆయన హయాంలో 23మంది వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొని అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఒకవేళ సొంతంగా పార్టీ పెట్టినట్లయితే డిపాజిట్లు కూడా వచ్చేవి కావని అన్నారు.

టీడీపీలో పోటీ చేయొద్దని దేవినేని అవినాష్‌ కు ముందే చెప్పానని.. చంద్రబాబు మోసం చేస్తున్నాడు తెలుసుకోమని చెప్పానని... తాను అన్నదే అయిందని, ఓడిపోయిన తరువాత అవినాశ్‌ ను చంద్రబాబు పురుగులా చూశాడని అన్నారు.

‘‘టీడీపీని నారా లోకేష్‌ రోడ్డు రోలర్‌ లా తొక్కేస్తున్నాడు. అతడి వల్లే టీడీపీ లో సంక్షోభం ఏర్పడింది. అందుకే టీడీపీ నేతలు పార్టీని వీడుతున్నారు. వల్లభనేని వంశీ టీడీపీని వదిలేస్తే ఎందుకు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ను చంద్రబాబు ఎందుకు వదిలారో చెప్పాలి. మరి కేసులకు భయపడి ఎంపీలు బీజేపీ లోకి వెళ్లినా చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదు’’ వీటన్నిటికీ సమాదానం చెప్పాలని కొడాలి నాని అన్నారు.

వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ.. టీడీపీలో ఇమడలేక ఆయన వైసీపీ కి మద్దతు తెలిపారని, ఆయన వైసీపీలోకి వచ్చినా యార్లగడ్డ వెంకట్రావుకు ఎటువంటి నష్టం ఉండదు. అవసరమైతే గుడివాడ సీటు యార్లగడ్డ వెంకటరావుకి ఇచ్చి నేను జగన్ వెనుక నడుస్తానని కొడాలి నాని అన్నారు.

Show comments