అల వైకుంఠపురానికి ఐరోపా లోకేషన్లు!

Tap to expand
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'అల వైకుంఠపురములో'.   'జులాయి'.. 'S/o సత్యమూర్తి' సినిమాల తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.  ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా ప్రోమోస్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.

ఇప్పటివరకూ 'అల వైకుంఠపురములో' సినిమా నుండి రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేస్తే రెండూ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.  సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ చూపిస్తున్నాడని మెచ్చుకుంటున్నారు.  ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా పాటల గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.  ఈ సినిమాలో పాటలను అందమైన లోకేషన్లలో చిత్రీకరించేందుకు యూరోప్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. త్వరలోనే 'అల వైకుంఠపురములో' టీమ్ యూరోప్ పయనం కానుంది.

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు మ్యూజికల్ హిట్సే.  ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాకు కూడా అదే ఫీట్ రిపీట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.  సూపర్ మ్యూజిక్ ప్లస్ బ్రిలియంట్ విజువల్స్ తోడైతే బాక్స్ ఆఫీస్ ను బన్నీ మరోసారి షేక్ చేయడం ఖాయమే.


Show comments