పాన్ ఇండియా దర్శకధీర నెక్ట్స్ లెవల్?

Tap to expand
సౌత్ సినిమాకి దశ-దిశ మార్చిన గ్రేట్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. బాహుబలి ఫ్రాంఛైజీతో మన మార్కెట్ స్థాయిని అమాంతం అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసిన దర్శకధీరుడు ఆయన. వీటన్నిటినీ మించి తెలుగు సినిమాకి గౌరవాన్ని పెంచిన గొప్ప మేధావిగా అతడిని ప్రపంచం కీర్తిస్తోంది. 88ఏళ్ల టాలీవుడ్ హిస్టరీలో అతడు ఓ సంచలనం అనే చెప్పాలి. సౌత్ ఇండస్ట్రీలో అప్పటివరకూ మణిరత్నం.. ప్రియదర్శన్ తర్వాత శంకర్ పేరు మాత్రమే జాతీయ స్థాయిలో పెద్దగా వినిపించేది. ఆ తర్వాత అన్నిటినీ పటాపంచలు చేస్తూ ఒక తెలుగు దర్శకుడు కూడా ఉన్నారు అని నిరూపించిన ఘనత మాత్రం రాజమౌళి వల్లనే సాధ్యమైంది.

బాహుబలి చిత్రంతోనే పాన్ ఇండియా అన్న పదం సౌత్ లో వినిపించింది. టాలీవుడ్ గమనాన్ని ఇప్పుడు అమాంతం మారిపోయింది అంటే ఆ ఫ్రాంఛైజీ సాధించిన విజయం వల్లనే. బాహుబలి 1.. బాహుబలి 2 తర్వాత సాహో చిత్రంతోనూ ప్రభాస్ హిందీ మార్కెట్ లో మాయాజాలం సృష్టించాడు అంటే అది దర్శకధీరుడు ఇచ్చిన ధీమానే. సైరా లాంటి భారీ ప్రయత్నం బాహుబలి చలువేనని మెగాస్టార్ చిరంజీవి అంగీకరించారు. ఇదంతా దర్శకధీరుడు వేసిన బాట అని ప్రముఖులంతా ప్రశంసిస్తున్నారు. అలాంటి గ్రేట్ డైరెక్టర్ నుంచి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ రాబోతోంది. 2020 జూలై 30 రిలీజ్ తేదీ అని ప్రకటించారు. ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో ఎలాంటి రికార్డులు తిరగరాయబోతందోనన్న క్యూరియాసిటీ మార్కెట్ వర్గాల్లో ఉంది. పాన్ ఇండియా కేటగిరీలోనే తెరకెక్కనున్న రామాయణం 3డిపైనా జాతీయ స్థాయిలో ఆసక్తి పెరిగింది. తెలుగు సినిమాని బాహుబలి ముందు బాహుబలి తర్వాత విభజించి విశ్లేషణలు సాగుతుండడం ఆసక్తికరం. ఇంతటి ఘనత వహించిన దర్శకధీర ఎస్.ఎస్.రాజమౌళి జన్మదినం నేడు(10 అక్టోబర్). ఆయన నుంచి నెక్ట్స్ లెవల్ సినిమాల్నే అభిమానులు ఆశిస్తున్నారు. ఈ బర్త్ డేని పురస్కరించుకుని ఆయన నుంచి ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించి ఏదైనా ఛమక్ వస్తుందేమోనన్న హోప్ ఉంది. ఇకపోతే ఆయన తదుపరి చిత్రం `మహాభారతం 3డి` అని ప్రచారమవుతోంది. కనీసం దీనిపై అయినా ఆయన బర్త్ డే వేళ క్లారిటీనిస్తారేమో చూడాలి. ఒకవేళ బాహుబలి ఫ్రాంఛైజీ నుంచి ఎక్స్ టెన్షన్ ఏదైనా ఉంటుందా? అన్నది రాజమౌళి చెప్పాల్సి ఉంటుంది. నేడు పుట్టినరోజును పురస్కరించుకుని జక్కన్నకు అభిమానుల తరపున తుపాకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతోంది.

నేడు టాలీవుడ్ అందాల కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే కావడం యాథృచ్ఛికం. అన్నట్టు దర్శకధీరుడితో ఒక్క సినిమాకి అయినా పనిచేయాలన్న రకుల్ కల నెరవేరుతుందో లేదో చూడాలి. రాజమౌళి బర్త్ డేతో పాటుగా.. బర్త్ డే బేబి రకుల్ పేరు హ్యాష్ ట్యాగ్ తో గూగుల్ లో వైరల్ గా ట్రెండింగ్ అవుతోంది. అలాగే నేటి ట్రెండింగ్ లో ఆయుష్మాన్ ఖురానా బాలా ట్రైలర్ ..  కియా బీట్ 360.. వరల్డ్ మెంటల్ హెల్త్ డే2019.. వైరల్ గా ట్రెండింగ్ అవుతున్నాయి. `మర్జవాన్` నుంచి నోరా ఫతేహి సాంగ్ ``ఏక్ తో కుమ్ జిందగని..` సాంగ్ గూగుల్ ట్రెండ్స్ లో వైరల్ గా ప్రమోటవుతోంది. జియో యూజర్స్.. ఐ లవ్ జియో.. బాయ్ కాట్ జియో..వంటివి ట్రెండింగ్ లో ఉన్నాయి.


Show comments