మేడ్ ఇన్ ఇండియా ఆపిల్ ఫోన్స్

Tap to expand
అమెరికా చైనా మధ్య జరుగుతన్న వాణిజ్య యుద్ధం వల్ల ఒక రకంగా ఇండియాకు మంచి జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలను ఆ దేశం విడిచి రావాలని హుకుం జారీ చేశారు. దాంతో చైనాలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు వేరే దేశాలకు తరలిపోవాలనే ఆలోచనలో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆపిల్. ఈ కంపెనీ నుండి వచ్చే ఫోన్లకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆపిల్ కంపెనీ చైనాను వదిలి భారత్ కు రావాలనే యోచనలో ఉన్నట్టు కేంద్రమంత్రి రవిశంకర్ తెలిపారు.

ఆపిల్ సంస్థ ఉత్పత్తులను అమెరికాలో డిజైన్ చేసి చైనాలో తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇప్పుడు ఆ కంపెనీ భారత్ కు వస్తుందని ప్రపంచంలోనే ఐదు పెద్ద మార్కెట్ ఉన్న దేశాలలో భారత్ ఒకటని ఇంత పెద్ద మార్కెట్ ఉన్న భారత్ ను కాదని ఎక్కడకి పోదని అంటున్నారు. భారత్ ఆపిల్ పెట్టుబడులు పెట్టడానికి పూర్తి స్థాయిలో సిద్ధం అయింది అన్నారు. ఇప్పటికే ఆపిల్ కంపెనీ అమెరికా తర్వాత అతి పెద్ద ఆఫీస్ ను హైదరాబాద్ లో నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తుంది.

హైదరాబాద్ ఆపిల్ ఆఫీస్ లో మ్యాప్ పనులు కూడా జరుగుతాయని తయారీ మాత్రం తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ కానీ ఆంద్రప్రదేశ్ లోని శ్రీ సిటీలో కానీ జరుగుతాయి. ఆపిల్ మాత్రమే కాదు శాంసంగ్ కూడా ఇప్పుడు చైనా నుండి ఇండియా వచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మన దేశం కస్టమ్స్ సుంకం ఐదు శాతం వరకు తగ్గించింది. ఇది కూడా ఆయా కంపెనీలకు వరంలా మారింది. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా భారత్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. హైదరాబాద్ లో నిర్వహణ చాలా సులభంగా ఉందని ఇక్కడ ఉద్యోగులను కూడా పెంచాలి అనుకుంటున్నట్టు కుక్ చెప్పారు. ఇదే నిజమైతే త్వరలోనే మనం మేడ్ ఇన్ ఇండియా ఆపిల్ ఫోన్స్ చూడొచ్చు.
Show comments