ఫోటో స్టొరీ: ఝకాస్ పోజిచ్చిన పటాస్ బేబీ

బుల్లితెరను ఏలుతున్న తెలుగు భామల్లో యాంకర్ శ్రీముఖి ఒకరు.  టీవీ ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు.  అదుర్స్.. అదుర్స్ 2.. మనీ మనీ.. భలే ఛాన్స్ లే.. పటాస్.. కామెడీ నైట్స్.. కామెడీ ఖిలాడీలు.. సరిగమప.. ఇలా శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించిన కార్యక్రమాల లిస్టు పెద్దదే.  అంతే కాదు ఈ తెలుగు భామ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. గ్లామరస్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియా టెంపరేచర్ పెంచడం శ్రీముఖి హాబీల్లో ఒకటి.

తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా అలానే కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలకు శ్రీముఖి ఇచ్చిన క్యాప్షన్ "కోజీ ఈవినింగ్స్".  ఈ ఫోటోలో శ్రీముఖి ఒక మెరూన్ కలర్ స్వెటర్ ధరించి.. ఫ్లోర్ పై కూర్చొని కాళ్ళ అందాలను ప్రదర్శిస్తూ సెన్సిటివ్ పోజులిచ్చింది. స్వెటర్ వేసుకొని కూర్చుంది కదా ఆమెకు వెచ్చగానే ఉంటుంది. కానీ ఆమె అందాల కాళ్ళను చూసిన నెటిజన్ల పరిస్థితి ఏం కావాలి? ఆమె సున్నితమైన ఎక్స్ ప్రెషన్లు చూస్తే నెటిజన్లు ఎలా స్పందించాలి.


స్పందించారు. తనివితీరా స్పందించారు. "బేబీ ఆన్ ఫైర్".. "రెడ్ రోస్ లా ఉన్నావు".. "హాట్ గా ఉంది.. కాఫీ".. "ఫ్యాన్స్ అందరికీ పండగే".. "శ్రీ.. పటాస్ కు మళ్ళీ ఎప్పుడు వస్తావు" అంటూ కామెంట్లు పెట్టారు.  ఈ ఫోటోలకు 1.3  లక్షల లైకులు రావడం గమనార్హం. ఏదైతేనేం.. శ్రీముఖి తన హాటు ఫోటో షూట్లతో తన 2.1 మిలియన్ ఇన్స్టా ఫోలోయర్లను మరింతగా పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.
More