వరుణ్ తేజ్ కోసం టెల్గు గర్ల్.. నిజమేనా హరీషు?

దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ తో 'వాల్మీకి' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.  వరుణ్ తేజ్ నెగెటివ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో తమిళ హీరో అధర్వ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.  బ్యూటిఫుల్ పూజా హెగ్డే ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బైటకు వచ్చింది.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ఒక అచ్చతెలుగు అమ్మాయిని జోడీగా ఎంపిక చేశారని సమాచారం.  హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఈ అమ్మాయి పేరు కృష్ణ మంజూష అని సమాచారం.  తెలుగు అమ్మాయిలకు తెలుగు సినిమాల్లో అవకాశాలు రావని.. ఫిలిం మేకర్లు అవకాశాలు ఇవ్వరనే ఒక అభిప్రాయం అందరిలో ఉంది. ఆ లెక్కన చూసుకుంటే వరుణ్ తేజ్ సరసన అవకాశం రావడం అంటే ఏకంగా జాక్ పాట్ తగిలినట్టే.  ఇలా కొత్త అమ్మాయికి అవకాశం ఇవ్వడం నిజమే అయితే 'వాల్మీకి' టీమ్ ను మనస్ఫూర్తిగా మెచ్చుకోవాల్సిందే.  


తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'జిగార్తాండ' కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.  తమిళంలో బాబీ సింహా పోషించిన పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తాడు. ఒరిజినల్ లో సిద్ధార్థ్ నటించిన పాత్రలో అథర్వ నటిస్తున్నాడు.   14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6 న విడుదల చేస్తామని ఈమధ్యే ఫిలిం మేకర్స్ ప్రకటించారు.

    

More