ఎన్టీఆర్ మహూర్తం:దుర్యోధనుడిగా బాలయ్య

Tap to expand

మొదట ఎన్టీఆర్ బయోపిక్ అనగానే అందరు ఆశ్చర్య పోయింది ఒకే ఒక్క విషయంలో. ఆయన రాజకీయాల గురించి ఎలా చూపిస్తారా? అని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అందులోను బాలకృష్ణ సినిమాను నిర్మిస్తూ.. ఎన్టీఆర్ పాత్రలో కనిపించడం చూస్తుంటే సినిమా వన్ సైడ్ ఉంటుందా లేక అన్ని అంశాలు ఉంటాయా అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతోంది. ఇక ఆ విషయాన్ని పక్కనపెడితే.. మొత్తానికి సినిమా అధికారికంగా లాంచ్ అయ్యింది. దర్శకుడు తేజ అనుకున్నట్టుగానే మొదట కొన్ని షాట్స్ తో సినిమాను స్టార్ట్ చేశాడు.

 

ఎన్టీఆర్ కెరీర్ లోనే చరిత్ర సృష్టించిన దాన వీర శుర కర్ణ సినిమాకు సంబంధించిన సీన్స్ ని తెరకెక్కించారు. అందులో ఎన్టీఆర్ చేసిన దుర్యోధనుడి క్యారెక్టర్ ఎంతగా ఫెమస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఆ క్యారెక్టర్ అంటే ఎంతో ఇష్టం. అయితే మొదట ఎంతో ఇష్టంగా బాలయ్య ఆ క్యారెక్టర్ లోనే కనిపించాడు. ఎన్టీఆర్ కాస్ట్యూమ్ ఉన్నట్లుగానే అంతా సెట్ చేసుకొని తన తండ్రి హావభావాలను కరెక్ట్ గా చూపించాడు. సీన్స్ లలో బాలయ్య చెప్పిన కొన్ని డైలాగులకు అక్కడి చిత్ర యూనిట్ క్లాప్స్ కొట్టింది.

 

ఇక సినిమా అయితే స్టార్ట్ అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ ని కంటిన్యూ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వారాహి ప్రొడక్షన్ వారితో కలిసి బాలయ్య సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఇక కీరవాణి సంగీతం అందిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ కు సినిమాటోగ్రాఫర్ గా ప్రముఖ బాలీవుడ్ కెమెరామెన్ సంతోష్ వర్క్ చేస్తున్నారు.

For More Photos Click Here

 

Show comments
More