జగన్ వీరావేశం.. అసెంబ్లీ అదిరిపోయింది..

Tap to expand

అసెంబ్లీ సాక్షిగా జీరో వడ్డీపై ఏపీ సీఎం జగన్ - ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. 11 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలకు 600 కోట్లే ఇచ్చారని మిగతా ఏం చేశారని బాబును జగన్ ప్రశ్నించడం కలకలం రేపింది. జీరో వడ్డీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కాజేసిందని.. ఎగ్గొట్టిందని రైతులకు ఏం ఇచ్చారని జగన్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు రచ్చ చేశారు. దీనిపై జగన్ ఫైర్ అయ్యారు. శాసనసభకు టీడీపీ రౌడీలు - గుండాలను తీసుకొచ్చారంటూ ధ్వజమెత్తారు. చొక్కాలు చించుకొని రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు.

ఇక అచ్చెన్నాయుడు వీరావేశంపై జగన్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అచ్చెన్నాయుడుకు బాడీ పెరిగింది కానీ బుద్ది పేరగలేదంటూ జగన్ ధ్వజమెత్తారు. జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పెద్ద ఎత్తున దూసుకొచ్చి రచ్చ చేశారు.

దీనిపై జగన్ సీరియస్ అయ్యారు. మేం 151 మంది ఉన్నామని.. తలుచుకుంటే మీరు ఒక్కరు ఉండరంటూ సీరియస్ అయ్యారు.

అనంతరం సభలో లొల్లిపై జగన్ తీవ్రంగా సీరియస్ అయ్యారు. టీడీపీ నేతలు రచ్చ చేస్తుంటే కూర్చోండని గట్టిగా గదమాయించాడు. ఇలా అసెంబ్లీలో శుక్రవారం రచ్చ రచ్చ జరిగింది. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నంతగా ప్రతిపక్ష - అధికార పక్షాలు గొడవకు దిగాయి.

 

Show comments
More