ఫస్ట్ లుక్ : యంగ్ భీష్మ వచ్చేశాడు

మాములుగా తెలుగు సినిమాల్లో భీష్ముడు అంటే తెల్లని బారు గెడ్డంతో వయసు మళ్లిపోయి రేపో మాపో అనేలా ఉండే లుక్స్ గుర్తుకువస్తాయి. మహాభారత గాధలో ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానమే అలా ఉండటం వల్ల భీష్మ అనగానే వయో వృద్ధుడు అనే ట్యాగ్ అలా ఫిక్స్ అయిపోయింది. దాన్ని మార్చేందుకు వస్తున్నాడు నితిన్. భీష్మ టైటిల్ తో వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న భీష్మలోని నితిన్ లుక్ ఒకటి బయటికి వదిలారు.

కార్పొరేట్ స్టైల్ లో హ్యాండ్ సంగా ఏదో మీటింగ్ లో సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతున్న మేనేజర్ గా నితిన్ ఆకట్టుకునేలా ఉన్నాడు. ఏదైనా కంపెనీకి అధినేతనా లేక ఉద్యోగినా అనే క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే నితిన్ గెటప్ ఎలా ఉంటుందన్న స్పష్టమైన క్లారిటీ అయితే దీంతో వచ్చేసింది. ఛలో తో డెబ్యూనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకీ కుడుముల రెండో సినిమా భీష్మ. మొదలుకావడం కొంత ఆలస్యం అయినప్పటికీ షూటింగ్ మాత్రం వేగంగా కానిచ్చేస్తున్నారు.

రశ్మిక మందన్న మరో ఆకర్షణగా నిలుస్తోంది. పెళ్లంటేనే ఆమడ దూరం పారిపోయే వినూత్న పాత్ర నితిన్ ఇందులో చేస్తున్నట్టు తెలిసింది. అతన్ని వలలో వేసే భామగా రష్మిక అల్లరి ఓ రేంజ్ లో ఉంటుందట. డిసెంబర్ మొదటి వారం రిలీజ్ ని డిసెంబర్ టార్గెట్ గా పెట్టుకున్న భీష్మకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఛలో రేంజ్ లో దీన్ని మ్యూజికల్ గానూ బ్లాక్ బస్టర్ గా నిలిపేలా ట్యూన్స్ కంపోజింగ్ జరుగుతోందట.

 

× RELATED బిచ్చగాడు-2
×