'క్రిష్-4'లో సూపర్ స్టార్ బ్యూటీ కనిపించనుందా..?

Tap to expand
ఇండియన్ స్క్రీన్ మీద సూపర్ హీరో జోనర్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన రికార్డ్ కేవలం క్రిష్ సిరీస్ ఒక్కటే దక్కించుకుంది. క్రిష్ సిరీస్ లలో ఇప్పటి వరకు విడుదలైన మూడు సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకులను మెప్పించాయి. ఇక హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సూపర్ హీరో సినిమాలు దేశవ్యాప్తంగా చిన్న పిల్లలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విడుదల అయిన ప్రతీ సిరీస్ పాన్ ఇండియా మూవీస్ లాగే అన్ని భాషలలో విడుదలై మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో చాలా కాలంగా సినీ ప్రేక్షకులు క్రిష్ -4 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు తెరకెక్కిన క్రిష్ సిరీస్ లన్నీ రాకేష్ రోషన్ దర్శకత్వంలోనే రూపొందాయి. తాజాగా దర్శకుడు రాకేశ్ రోషన్ ఈ సీక్వెల్ 4 పై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. క్రిష్ -4 త్వరలో పట్టాలు ఎక్కనుందని.. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుందని మొదటి మూడు సినిమాల కంటే మరింత అడ్వాన్స్ విజువల్ వండర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దే పనిలో ఉన్నట్లు తెలిపాడు.

దానికి తగ్గట్లే కథ కూడా సిద్ధం చేస్తున్నారట. అయితే ఈ సినిమా గురించి మరో వార్త నెట్టింట వైరల్ అయింది. హృతిక్ గ్రహాంతర ఫ్రెండ్ జాదూ ఈ మూవీలో మరోసారి కనిపించనున్నాడట. అయితే తాజాగా క్రిష్ 4 లో నక్షత్ర మండలాల్లోకి ప్రయాణించే థీమ్ చూపించనున్నారట. హృతిక్ సూపర్ హీరో క్యారెక్టర్.. చనిపోయిన తన సైంటిస్ట్ తండ్రి రోహిత్ మెహ్రాను తిరిగి తీసుకురావడానికి ట్రై చేస్తాడని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు క్రిష్ సిరీస్ లో హీరోయినుగా ప్రియాంక చోప్రా నటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రియాంక భర్త నిక్ జోనస్ తో కలిసి అమెరికాలోనే సెటిల్ అయింది. ఇక హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉందట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హృతిక్ సరసన కృతి సనన్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ ప్రచారం అవుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
Show comments