స్టార్స్ మౌనంపై ఆ దర్శక నిర్మాత అసహనం

Tap to expand
బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం తర్వాత చాలా మంది ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ను టార్గెట్ చేసి విమర్శలు చేయడం మొదలు పెట్టారు. కరణ్ జోహార్ బంధుప్రీతిని చూపిస్తూ కేవలం స్టార్స్ పిల్లలతోనే సినిమాలు చేస్తున్నాడు. బయట నుండి వచ్చిన కొత్త వారిని ఆయన కనీసం పట్టించుకోడని ఎవరికి అయినా ఆఫర్లు వచ్చినా వారిని తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తాడంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో కరణ్ జోహార్ ఏకంగా తన సోషల్ మీడియా అకౌంట్ ను డిజేబుల్ చేసే పరిస్థితి వచ్చింది. తనపై ఇంతగా విమర్శలు వస్తుంటే ఇప్పటి వరకు తనకు స్టార్స్ నుండి మద్దతు దక్కక పోవడంపై కరణ్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు.

కరణ్ జోహార్ దర్శకుడిగా నిర్మాతగా ఎంతో మంది స్టార్స్ పిల్లలకు లైఫ్ ఇచ్చాడు. కెరీర్ లో స్టార్స్ గా నిలబెట్టాడు. అలాంటిది ఇప్పుడు ఆయన కష్టాల్లో ఉండి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే సాహసం ఎవరు చేయడం లేదు. అందుకు కారణం లేకపోలేదు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ విషయంలో చాలా ఉద్రేకంగా ఉంది. సుశాంత్ మరణంకు బాలీవుడ్ మాఫియానే కారణం అంటూ ప్రచారం చేస్తోంది. ఒక వేళ తాము కరణ్ జోహార్ కు మద్దతుగా నిలిచినట్లయితే మమ్ములను కూడా కంగనా బాలీవుడ్ మాఫియాలో చేర్చుతుందని స్టార్స్ భయంతో మౌనంగా ఉంటున్నారు.

కరణ్ జోహార్ విషయంలో ప్రస్తుతానికి మౌనంగా ఉంటేనే అన్ని విధాలుగా మేలు అన్నట్లుగా స్టార్స్ భావిస్తున్నారు. ఇది చాలా సున్నితమైన విషయం కనుక సుశాంత్ అభిమానులు కూడా రెచ్చి పోయి మమ్ములను టార్గెట్ చేస్తారేమో అని స్టార్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి భయం నిజమే అవ్వచ్చు. ఎందుకంటే సుశాంత్ మరణంకు కరణ్ కారణం అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయనకు మద్దతుగా మాట్లాడటం అంటే వారికి వ్యతిరేకంగా వ్యవహరించడం అవుతుంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొనేందుకు ఏ స్టార్ సిద్దంగా లేడు. అందుకే కరణ్ బాధపడ్డ కోపగించుకున్నా కూడా బాలీవుడ్ స్టార్స్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు.
Show comments