నేను పెళ్లి చేసుకోలేదు నమ్మండి అంటున్న హీరోయిన్

Tap to expand
తమిళ బిగ్ బాస్ తో మంచి గుర్తింపు దక్కించుకుని ప్రస్తుతం నటిగా మెల్ల మెల్లగా క్రేజ్ ను దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ యషికా ఆనంద్. ఈమద్య కాలంలో ఈమె గురించి మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం ఈమె ఒక వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ వార్తలను జనాలు మర్చి పోయారు. ఈ సమయంలో యషికా ఆనంద్ వివాహిత మాదిరిగా ఉన్న ఒక ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది.

ఆ ఫొటోలో యషికా నుదుటన సింధూరం పెట్టుకోవడంతో పాటు వివాహిత మాదిరిగా చాలా పద్దతిగా కొత్తగా పెళ్లి అయ్యిందా ఈమెకు అన్నట్లుగా ఉండటంతో అంతా ఈ లాక్ డౌన్ లో యషికా రహస్యంగా పెళ్లి చేసుకుందేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. తమిళ మీడియాలో ఈమె గురించి కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు విషయం చెప్పేందుకు మీడియా ముందుకు వచ్చింది.

ఒక యాడ్ చిత్రీకరణ కోసం తాను అలా మేకప్ అయ్యాను తప్ప నేనేం పెళ్లి చేసుకోలేదు. అసలు ఇప్పట్లో పెళ్లి ఆలోచనే లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. తన ప్రేమ విషయంలో కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి నేను నా వృత్తిని ప్రేమిస్తున్నాను. అంతే తప్ప నా జీవితంలో ఎవరు లేరు అంటూ చెప్పుకొచ్చింది. ఈమె నోటా చిత్రంలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర అయ్యింది.
Show comments