మెగా ప్రిన్స్ తో సైరా సూరి

Tap to expand
సైరా నరసింహారెడ్డి తర్వాత సురేందర్ రెడ్డి (సూరి) తదుపరి ప్రాజెక్ట్ వివరాలు ఇంకా ప్రకటించనేలేదు. ప్రభాస్ తో సినిమా చేస్తాడని ప్రచారం సాగుతోంది గానీ అందులో వాస్తవం ఎంత అన్నది తేలలేదు. ఇప్పటికే సూరి దగ్గర స్క్రిప్టులు సిద్దంగా ఉన్నా.. స్టార్ హీరోలు ఎవరూ ఖాళీ లేకపోవడంతో కొంత వెయిట్ చేయాల్సి వస్తోంది. పైగా `సైరా` తర్వాత డైరెక్ట్ చేసే సినిమా ప్రతిష్టాత్మకంగా ఉండాలి కాబట్టి కంగారుపడి ఏ నిర్ణయం తీసుకోలేదు. సూరి మైండ్ లో స్టార్ హీరోలే మెదులుతున్నారు! తప్ప యంగ్ హీరోల వైపు చూస్తున్నట్లు కనిపించలేదు. తాజాగా సూరి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

వరుణ్ కోసం అదిరి పోయే యాక్షన్ స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టాడుట. సురేందర్ రెడ్డి స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడుట. తనవద్ద ఉన్న స్క్రిప్ట్ పై నమ్మకంతోనే దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతల్ని తానే తీసుకుంటున్నట్లు ఓ ఇంట్రెస్టింట్ అప్డేట్ హీటెక్కిస్తోంది. సూరి కి సపోర్ట్ గా మరో నిర్మాత రాజీవ్ రెడ్డి కూడా ఈ సినిమాలో భాగం కానున్నాడుట. మరి ఈ కథకు మెగా ప్రిన్స్ ఒకే చెప్పాడా? లేదా? అన్న వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇక యాక్షన్ చిత్రాలను స్టైలిష్ గా తెరకెక్కించడం సూరికి కొట్టిన పిండి. టాలీవుడ్ లో స్టైలిష్ దర్శకుడి గా పేరు సంపాదించడానికి తన స్టైలిష్ మేకింగ్ కారణ అన్నది తెలిసిందే.

ప్రస్తుతం వరుణ్ తేజ్ కొత్త కుర్రాడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో బాక్సింగ్ నేపథ్యం లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా చిత్రీకరణ తర్వాత వరుణ్ తదుపరి ప్రాజెక్ట్ వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సూరి స్రిప్ట్ రెడీ చేసి ఇతర పనుల్లో ఉన్న్టట్లు సమాచారం. ఇప్పటికే మెగా కాంపౌండ్ లో ధృవ- సైరా లాంటి సక్సెస్ లు ఇచ్చిన దర్శకుడు కాబట్టి మెగా ప్రిన్స్ సూరి ఆఫర్ ని ఎందుకు మిస్ చేసుకుంటాడు? అంటూ అభిమానుల్లో చర్చ సాగుతోంది.


Show comments