రాజుగారికి పెద్ద చిక్కే వచ్చి పడిందే..

Tap to expand
టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్న దిల్ రాజు మరో వైపు డిస్టిబ్యూటర్ గా కూడా సినిమాలు రిలీజ్ చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాల నుంచి ఇతర భాష చిత్రాల వరకు థీయాట్రికల్ రైట్స్ కొనుక్కొని ఏపీలో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి నైజాం రైట్స్ ని మాత్రమే తీసుకుంటే డబ్బింగ్ సినిమాలకి మాత్రం తెలుగు రిలీజ్ రైట్స్ ని కోనేస్తూ ఉంటారు.

ఇక డిస్టిబ్యూటర్ గా దిల్ రాజుకి చాలా సినిమాలు మంచి లాభాలు తీసుకొచ్చాయి. గత ఏడాది మణిరత్నం సూపర్ హిట్ మూవీ పొన్నియన్ సెల్వన్ తెలుగు డబ్బింగ్ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అయితే ఆ మూవీ కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో అతనికి ఆదాయం తెచ్చిపెట్టలేదు. అయితే ఓ వైపు నిర్మాతగా ఉంటూ మరో వైపు డిస్టిబ్యూటర్ గా ఉండటం వలన తన వారసుడు సినిమా తెలుగు రిలీజ్ విషయంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అందరూ చూసే ఉంటారు.


మరోసారి అలాంటి తలనొప్పి పొన్నియన్ సెల్వన్ 2 విషయంలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 28న పొన్నియన్ సెల్వన్ 2 మూవీ రిలీజ్ కాబోతుంది. అదే రోజు తెలుగులో సురేందర్ రెడ్డి అఖిల్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ఏజెంట్ ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి ఏకంగా 80 కోట్లతో నిర్మించారు.

అయితే ఈ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలని అక్కినేని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మొదటి సినిమాతో రాని లాభాలు పొన్నియన్ సెల్వన్ 2తో అయినా రాబట్టుకోవాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మెజారిటీ థియేటర్స్ లో పీసీ2 రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఏజెంట్ స్ట్రైట్ తెలుగు సినిమా కాబట్టి మొదటి ప్రాధాన్యత తమ హీరోకె ఇవ్వాలని అక్కినేని అభిమానులు డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది.

అదే జరిగితే దిల్ రాజుకి మరోసారి ఏప్రిల్ 28 రిలీజ్ తలనొప్పులు మొదలవుతాయి అనే మాట వినిపిస్తుంది. ప్రస్తుతానికి ఏజెంట్ ప్రమోషన్స్ ఏవీ స్టార్ట్ కాలేదు. ఈ నేపధ్యంలో రిలీజ్ వాయిదా `పడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాని అదే రోజు రిలీజ్ అంటే మాత్రం దిల్ రాజుకి టెన్షన్ స్టార్ట్ అయినట్లే అనే మాట వినిపిస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Show comments
More