'సైరా' థియేటర్లపై టాస్క్ ఫోర్స్ దాడులు

Tap to expand
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విషయంలో ఎంత పక్కాగా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని పరిశ్రమలపై కూడా జీఎస్టీని ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తున్నారు. సినిమా పరిశ్రమలో కూడా జీఎస్టీ ఉంది. థియేటర్ల యాజమానులు జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. సినిమాను బయ్యర్లు కొనుగోలు చేసి ప్రదర్శిస్తారు కనుక ఆ జీఎస్టీని బయ్యర్లు చెల్లించాలి. ఇటీవల విడుదలైన సైరా చిత్రం భారీగా వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయా.. జీఎస్టీ సరిగా చెల్లిస్తున్నారా అనే విషయాన్ని పరిశీలించేందుకు టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది.

ఈస్ట్ గోదావరి జిల్లాలోని పలు థియేటర్లలో జీఎస్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారట. అక్కడ లెక్కలు అన్ని సరిగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని పరిశీలించారని తెలుస్తోంది. జీఎస్టీ అధికారులకు ఎలాంటి సమాచారం అక్కడ లభించింది... కేవలం అక్కడేనా మొత్తం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా సైరా థియేటర్లపై జీఎస్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేయబోతున్నారా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

సినిమాను బయ్యర్లు కొనుగోలు చేసిన ఒప్పందం ప్రకారం జీఎస్టీ మొత్తాన్ని కూడా నిర్మాత రామ్ చరణ్ చెల్లించాల్సి ఉంది. బ్రేక్ ఈవెన్ వచ్చిన తర్వాత బయ్యర్లు జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందట. ఇంకా పలు చోట్ల బ్రేక్ ఈవెన్ కు చేరుకోలేదు. కనుక రామ్ చరణ్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా షేర్ వసూళ్లు అయిన నేపథ్యంలో జీఎస్టీ భారీగానే వసూళ్లు అయ్యి ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

Show comments