సైరా దర్శకుడు ఫ్రెండ్స్ కి పార్టీ

Tap to expand
మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా- నరసింహారెడ్డి` హిట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఫలితం ఊహించని విధంగా ఉందన్న విశ్లేషణ ట్రేడ్ లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించలేదు. ఇక ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో చెప్పాల్సిన పనే లేదు. మౌత్ టాక్ బావున్నా ఆశించినంత వసూళ్లు దక్కకపోవడం నిరాశపరిచింది. తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి స్టామినాతో చక్కని వసూళ్లు దక్కినా.. ఇరుగు పొరుగున అది కుదరలేదు.

అయితే ఇంత భారీ సినిమా తీసిన సురేందర్ రెడ్డికి మంచి మార్కులే పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆయన హైదరాబాద్ పరిశ్రమలో తన స్నేహితులకు పార్టీ ఇచ్చారని తెలుస్తోంది. సైరా రిలీజైన ఇరవై రోజుల తర్వాత ఆయన పార్టీ ఇవ్వడం ఆసక్తికరం. ఈ పార్టీకి ఎవరెవరు ఎటెండయ్యారు? అన్నది తెలియాల్సి ఉంది.  

కిక్-రేసుగుర్రం-ధ్రువ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్ని తెరకెక్కించారు సురేందర్ రెడ్డి. సైరా చిత్రంతో పాన్ ఇండియా దర్శకుడయ్యారు. తదుపరి ఎలాంటి సినిమాని తీయబోతున్నారు? అన్నది చూడాలి. ఇప్పటికైతే ప్రభాస్ తో కానీ పవన్ తో కానీ సినిమా తీస్తాడు అంటూ ప్రచారం సాగుతోంది. కానీ ఏదీ కన్ఫామ్ కాలేదు. తదుపరి సురేందర్ రెడ్డి ఎలాంటి కాన్వాసుతో సినిమా తీస్తాడు? ఎవరితో చేస్తాడు? అన్నది చూడాల్సి ఉంది.
Show comments