ఆర్ఆర్ఆర్ సినిమాలోని తన వల్లే నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిందని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అజయ్ దేవగన్ నటించిన భోళా చిత్రం మార్చి 30 తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా కు ఇది రీమేక్ భోళా చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ది కపిల్ షో కార్యక్రమంలో అజయ్ దేవగన్ మరియు టబూ పాల్గొన్నారు.
ఆ కార్యక్రమంలో అజయ్ దేవగన్ నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడం పట్ల స్పందిస్తూ నా వల్లే ఆస్కార్ వచ్చింది అని సమాధానం ఇచ్చారు. అది విన్న కపిల్ షాక్ అయ్యి అది ఎలాగా అంటూ ప్రశ్నించగా.. ఆ పాటకు నేను డాన్స్ చేస్తే పరిస్థితి ఏంటి? నేను చేయలేదు కనుక ఆస్కార్ వచ్చింది అన్నట్లుగా అజయ్ దేవగన్ ఫన్నీగా సమాధానం ఇచ్చారు. మొత్తానికి ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.