రాఖీ పండుగకి ఆ సోదరికి ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చిన సోనూసూద్ !

Tap to expand
సోనూసూద్ .. మంచితనానికి మానవత్వానికి నిలువెత్తురూపం. కష్టాల్లో ఉన్నాం అంటే ప్రభుత్వం స్పందించకపోవచ్చు కానీ అన్నా మేము కష్టాల్లో ఉన్నాం అని సోనూసూద్ కి చెప్పుకుంటే సినిమా రీతిలోనే క్షణాల్లో ఆ సమస్య తీరిపోతుంది. ప్రస్తుతం సోనూసూద్ ను కలియుగ కర్ణుడిగా అభివర్ణిస్తున్నారు. ఢిల్లీ నుండి గల్లీ వరకు ఎవరు ఏ సాయం కావాలన్నా కూడా నిముషాల్లో స్పందించి వారికీ సాయంగా నిలుస్తున్నాడు. కరోనా సమయంలో చాలా మంది వలస కూలీలను వారివారి సొంత గ్రామాలకు చేర్చిన సోనుసూద్ వారి పాలిట దేవుడు అయ్యాడు. సినిమాలో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో అందరి దృష్టిలో హీరో అనిపించుకుంటున్నాడు. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. కానీ ఎదుటివారికి సహాయం చేయాలనే గుణం మాత్రం కొందరికి మాత్రమే ఉంటుందని చూపించాడు సోనుసూద్. సోనూసూద్ ఉన్న డబ్బుతో పోలిస్తే ..అంతకి 100 రేట్లు డబ్బు ఉన్న వారు కూడా ఉన్నారు. కానీ వారికీ పెట్టాలి అన్న ఆలోచనే లేదు.

ఇక విషయంలోకి వెళ్తే .. అస్సాంలోని జల్ పైగురిలో వరదల కారణంగా ఓ మహిళ పూరి గుడిసె దాదాపుగా పూర్తిగా నాశనం అయిపోయింది. తిరిగి నిర్మించుకోవడానికి కూడా ఆమెకి సహాయంగా భర్త కూడా లేడు. ఇక ఆమె పిల్లలు తినడానికి కూడా తిండి లేని దీన స్థితిలో ఉన్నారు. పూర్తిగా ధ్వంసమైన వీడియోని సోనాల్ సింఘ్ అనే మహిళ ట్విట్టర్ లో పోస్ట్ చేసి సోనూసూద్ కి ట్యాగ్ చేసింది. అది చూసి చలించిపోయిన సోనూసూద్ .. ఆమెకు రాఖీ పండుగరోజును ఆ చెల్లెమ్మకి ఓ కొత్త ఇంటిని కానుకగా ఇస్తానని హామీ ఇచ్చాడు. "రక్షా బంధన్ సందర్భంగా మా సోదరికి సహాయం చేద్దాం. ఆమె కోసం కొత్త ఇల్లు కట్టుకుందాం" అని సోను సూద్ ట్వీట్ చేశారు. దీనితో సోనూసూద్ పై మరోసారి సోషల్ మీడియా లో ప్రశంశల వర్షం కురుస్తుంది. ఓ అన్న తన సోదరికి రాఖీ రోజు ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఇవ్వలేడు అని కామెంట్స్ చేస్తున్నారు.
Show comments