మతిపోయే అందాలతో కిక్కిస్తున్న బ్యూటీ'పూల్' భామ!

Tap to expand
బాలీవుడ్ కుర్ర హీరోయిన్ సారా అలీఖాన్.. గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సాటి హీరోయిన్లకు అభిమానులకు ఫేవరేట్ గా నిలుస్తుంది. పటౌడీ ఫ్యామిలీ వారసుడు సైఫ్ అలీఖాన్ కూతురు కావడంతో సారాను ఇండస్ట్రీలో యువరాణిలా ట్రీట్ చేస్తుంటారు. 2018లో విడుదలైన ‘కేదార్నాథ్’ సినిమాతో సారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాత రణ్వీర్ సింగ్కు జోడీగా నటించిన ‘సింబా’ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. ఆ సినిమాతో సారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అదే ఊపులో ఈ ఏడాది కార్తీక్ ఆర్యన్ సరసన ‘లవ్ ఆజ్ కల్’ సినిమా చేసింది. ఆ సినిమాలో అమ్మడి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం నాజూకుగా ఉన్న సారాను చూసి దేశవ్యాప్తంగా యువత మనసు పారేసుకుంటుంది.

ఇక ఈ కుర్రభామకి సోషల్ మీడియాలో కోటి పైనే ఫాలోవర్లు ఉన్నారు. సినిమాలలోకి రాకముందు అమ్మడు ఎంత లావుగా ఉండేదో తెలిస్తే షాక్ అవుతారు. అసలు తను హీరోయినుగా కాదు కదా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పనికిరాదని అందరూ విమర్శించారు. అలాంటి సారా ఇప్పుడు దేశం మొత్తాన్ని తన అందాలతో ఊపేస్తుంది. విమర్శించిన వారందరికి దిమ్మతిరిగే రేంజ్ లో స్లిమ్ గా మారి షాక్ ఇచ్చింది. వాస్తవానికి అమ్మడి అందాలను చూస్తే కళ్లు తిప్పుకోలేరు. అంత నాజూకుగా తయారయ్యింది. కానీ అలా నాజూకుగా మారడానికి ఎంతో శ్రమించింది సారా. ఇక తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడు స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇక బెలూన్ పై కూర్చుని వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇక సారాని చూస్తే బికినీ ధరించి కుర్రాళ్ళ మతుల్ పోగొడుతుంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా సారా ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నట్లు సమాచారం.
Show comments