పవన్ బాలయ్య చేస్తే తప్పులేదు.. నేను చేస్తే తప్పా: రోజా

Tap to expand
సీనియర్ నటి వైసీపీ ఎమ్మెల్యే రోజా కోపంతో ఊగిపోయారు. ఓ జర్నలిస్టును కడిగిపారేశారు. ఓ ప్రశ్న వేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. జబర్ధస్త్ లో మీరు వ్యవహరించే తీరుపై కామెంట్స్ ట్రోల్స్ చేస్తున్నారని.. అది మానుకుంటే బెటర్ అంటూ విలేకరి ప్రశ్న అడగగానే తనదైన శైలిలో రోజా కౌంటర్ ఇచ్చారు.

ప్రతీ వ్యక్తికి ఒక ప్రొఫెషన్ ఉంటుందని.. తాను నటిని అని.. ఆ రంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచానని.. సీనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ బాలక్రిష్ణ లాంటి వాళ్లు సినిమాలు చేస్తున్నప్పుడు నేను ఆర్టిస్ట్ గా చేస్తే తప్పు ఏంటి అని రోజా నిలదీశారు. మగవాళ్లు చేస్తే తప్పు లేదు.. ఆడవాళ్లు చేస్తే తప్పు ఏంటని ప్రశ్నించారు. ఇతర రంగాల్లో చాలా మంది రాజకీయ నాయకులు డబ్బు సంపాదిస్తున్నారని.. తనకు అవినీతి వేరే వ్యాపారాలు లేవని.. ఆర్టిస్టుగా నిజాయితీగా తనకు వచ్చిన కళతో సంపాదిస్తున్నానని రోజా వివరించారు.

జబర్ధస్త్ లో డ్యాన్స్ చేస్తున్నానని టీడీపీ వాళ్లు ట్రోల్స్ చేస్తున్నారని.. అందుకే తగ్గించానని.. మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేనిది మీకెందుకు బాధ అంటూ రోజా నిలదీశారు. తన క్రేజ్ చూసి చాలా మంది బాధపడుతున్నారని మండిపడ్డారు. ఈ కామెడీ షోతో చాలా మంది బాధలన్నీ మరిచిపోతున్నారని.. సరదాగా నవ్వుకుంటున్నారని.. టీడీపీ వాళ్లు ఎన్ని ట్రోల్స్ చేసినా తాను పట్టించుకోనని స్పష్టం చేశారు.

రాజకీయాలు సినిమాలు నటన తనకు రెండు కళ్లు అని.. అందులో ఫుల్ టైమ్ రాజకీయాల్లో కొనసాగాలంటే సినిమాలకు దూరమవుతాను అంటూ రోజా వివరణ ఇచ్చారు.
Show comments