సైరాలో ఆ సీన్ కోసం 2 నెలలు కిందామీదా పడ్డారట

Tap to expand
సైరా సినిమాలో నరసింహనాయుడ్ని ఉరి తీసే సీన్ గగుర్పాటుకు గురి చేయటమే కాదు.. సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిందని చెప్పాలి. ఆ సీన్ సినిమాటిక్ గా ఉండి.. వాస్తవాన్ని పక్కకు తీసుకెళ్లినట్లు ఉన్నప్పటికీ.. సైరా పాత్రకు మరోస్థాయికి తీసుకెళ్లేలా ఆ సీన్ ఉందన్న మాట పలువురి నోట వినిపించింది.

అయితే.. ఆ సీన్ ను ఫైనల్ చేయటానికి ఒకట్రెండు రోజులు కాదు ఏకంగా రెండు నెలలు కిందామీదా పడ్డారట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరికి సంబంధించిన ఈ సీన్ కోసం తాము పడిన శ్రమ గురించి చిత్ర నిర్మాత రాంచరణ్ తాజాగా వెల్లడించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన సైరా క్లైమాక్స్ కు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి విప్లవ వీరుడి పాత్రను చేయటం.. అలాంటి సినిమాకు తాను నిర్మాత కావటం మర్చిపోలేనన్నారు. సైరా క్లైమాక్స్ లో ఉరి తీసే సన్నివేశాన్ని తెర మీద చూస్తున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదన్నారు. తల తెగి ఉన్న ఆయన్ని అస్సలు చూడలేకపోయానని చెప్పారు. తండ్రిని విపరీతంగా ఆరాధించే ప్రతి కొడుక్కి.. అలాంటిది కఠిన పరీక్షే అవుతుందని చెప్పక తప్పదు. 
Show comments