సైరా సాంగ్: ఆ 8 కోట్లు గంగలో పోసినట్టే!

Tap to expand
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం `సైరా-నరసింహారెడ్డి`. తెలుగు-తమిళం-హిందీ-మలయాళం-కన్నడంలో అత్యంత భారీ గా రిలీజైంది. ఈ సినిమా సక్సెస్ గురించి.. అలాగే సాధించిన విజయం గురించి.. ఇతరత్రా ఆసక్తికర సంగతులు రామ్ చరణ్ హైదరాబాద్ మీడియాతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా చరణ్ చెప్పిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు రూ.8కోట్లు వెచ్చించి ఉయ్యాలవాడ పాత్రధారి చిరంజీవి- మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాపై తెరకెక్కించిన ఓ పాటను చిత్రం నుంచి తొలగించాల్సి వచ్చిందట. నిడివి ఎక్కువ కావడంతో ఆ పాటను తొలగించాల్సి వచ్చిందని చరణ్ తెలిపారు. ఇక ఈ సినిమా విజయం పట్ల సంతృప్తికరంగా ఉన్నామని చరణ్ అన్నారు. ఇప్పటికి రూ.275కోట్లు వసూలు చేసిందని తెలిపారు.

హీరోగా .. నిర్మాతగా కొనసాగడం అంటే రెండు పడవల ప్రయాణమే. అది చాలా కష్టంతో కూడుకున్నది. నాన్నగారు అలా చేయాలనుకున్నా కానీ కుదరలేదు. నేను మాత్రం కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ స్థాపించింది ఆయన కోసమే. వరుసగా చిరుతో సినిమాలు నిర్మిస్తాను అని తెలిపారు.


Show comments