ప్లాస్టిక్ సర్జరీ పై వార్తలపై హీరో స్పందన

Tap to expand
హీరోల గురించి.. హీరోయిన్స్ గురించి సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పుకార్లు అనేవి ఈ మధ్య కాలంలో చాలా కామన్ విషయం. అయితే కొన్ని పుకార్లు సీరియస్ గా అనిపిస్తాయి.. మరికొన్ని పుకార్లు నిజమేనేమో అనిపిస్తాయి. అలాంటి పుకార్లు ఇప్పుడు బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ గురించి వస్తున్నాయి.

ఇటీవల రాజ్ కుమార్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన నటించిన భీద్ చిత్రం మార్చి 24 తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో రాజ్ కుమారు లుక్ కాస్త విభిన్నంగా ఉంది. గతంతో పోలిస్తే ఆయన ఫేస్ షేప్ మారినట్లుగా అనిపిస్తుంది. అందుకే రాజ్ కుమార్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఉంటాడు అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు.


ఆ పుకార్లపై రాజ్ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని పేర్కొన్నాడు. నేను ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు.

జనాలు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. ఇలాంటివి విన్నప్పుడు నాకు నవ్వు ఆగదు. ఇలాంటి పుకార్లు చూసినప్పుడు ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుందని రాజ్ కుమార్ పేర్కొన్నాడు.

రాజ్ కుమార్ కనుబొమ్మలు మరియు ముక్కు షేప్ సరిగా లేవు అంటూ గతంలో విమర్శలు వచ్చేవి. కానీ ఇప్పుడు కాస్త మారినట్లుగా అనిపిస్తున్నాయి. అందుకే రాజ్ కుమార్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడేమో అనే ప్రచారం మొదలైంది.

చాలా మంది ఆ ప్రచారాన్ని నమ్ముతున్నారు కూడా.. అయితే అలాంటిదేమీ లేదని రాజ్ కుమార్ క్లారిటీ ఇవ్వడంతో వార్తలకు పుల్ స్టాప్ పడుతాయేమో చూడాలి.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Show comments
More