పీకే టీం పాక్ చేసుకుని వెళ్తుందా...?

Tap to expand
పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ టీం కి మొత్తం ఏపీ సీన్ అర్ధమైపోయిందా. తాము చేసేది ఏమీ ఉండదని సైతం బోధపడిందా. పీకే టీం గత అయిదేళ్ళుగా వైసీపీతో ఉంటూ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తోంది. 2017లో వైసీపీ ప్లీనరీలో జగన్ ప్రశాంత్ కిశోర్ ని తమ పార్టీకి పరిచయం చేశారు.

ఆ తరువాత పీకే టీం రంగంలోకి దిగి వైసీపీని గెలిపించామన్న ముద్రను వేసుకుంది. నిజానికి అప్పట్లో జగన్ గెలుపునకు అనేక కారణాలు. దానికి పీకే టీం ఎంతో కొంత సాయం చేయడం జగన్ 151 సీట్లతో ముఖ్యమంత్రి అయిపోయారు. అయితే ఈ మొత్తం క్రెడిట్ అంతా తమదే అని పీకే టీం భావించడం జగన్ సైతం వారికి  అనవసర   ప్రాధాన్యత ఇవ్వడంతో పీకే టీం వైసీపీలో అందరి కంటే ఎక్కువగా అయిపోయింది.


అది చివరికి అధికారంలో ఉన్న వైసీపీలో నేతల మధ్య విభేదాలకు కారణం అయింది. చేసిన సర్వేలు కానీ ఇచ్చిన సలహాలు కానీ ఏవీ పెద్దగా పనికిరావడంలేదని తాజాగా వచ్చిన మూడు పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ తరువాత బాగా తెలిసిపోయింది.  మరో వైపు మొక్కుబడి సర్వేలు ఇస్తూ పబ్బం గడుపుకుంటోందని ఆరోపణలు కూడా పీకే టీం మీద వచ్చాయి. గెలిచే క్యాండిడేట్లు ఎమ్మెల్యేలు ఉన్న చోట ఓటమి చూపుతూ గెలవలేని  సీట్లలో మేనేజ్ చేస్తూ అటు అధినాయకత్వాన్ని మభ్యపెడుతూ ఇటు పార్టీలో చిచ్చు పెడుతూ పీకే టీం రెండవ సారి వ్యూహాలు అన్నీ అతి పెద్ద దెబ్బగా మారాయని అంటున్నారు.

ఇన్నాళ్ళూ పార్టీలో పీకే టీం మీద విమర్శలు ఎన్ని వచ్చినా అధినాయకత్వం పూర్తిగా నమ్మడం వల్లనే వారి కధ సాఫీగా సాగింది. ఎపుడైతే గ్రాడ్యుఏట్ ఎన్నికల్లో వైసీపీకి పరాభవం రావడంతో జనాలు ఇచ్చిన అసలైన సర్వేలను చూసిన పీకే టీం కి గుండె దడ మొదలైంది అంటున్నారు. అలాగే అధినాయకత్వం సైతం ఫస్ట్ టైం పీకే టీం మీద అనుమానపు చూపులు విసరడంతో అడకత్తెరలో పోకచెక్కలాంటి పరిస్థితి పీకే టీఎం ఎదురవుతోంది అంటున్నారు.

నాలుగేళ్ళ పాలన గడచింది. జనాల్లో వైసీపీ ఏలుబడి మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇక తాము ఏమి చేసినా అయ్యే పని కాదు అని పీకే టీం కి పూర్తిగా అర్ధం అయిందట. అదే టైం లో అధినాయకత్వం కూడా గతంలో మాదిరిగా తాము ఏమి చెప్పినా నమ్మడానికి సిద్ధంగా లేదని చెప్పడమే మిగిలి ఉంది అని అంటున్నారు తేలిపోయిందట. దాంతో పీకే టీం పెట్టే బేడా సర్దుకుని ప్యాకప్ చెప్పడమే నెక్స్ట్ సీన్ అని అంటున్నారు  .

ఈ నేపధ్యంలో 2024 ఎన్నికల కోసం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుని మరీ ఎన్నికలకు ఏడాది ముందే పలాయనం చిత్తగించాలని చూస్తోందని ఒక టాక్ అయితే బయట స్ప్రెడ్ అవుతోందిట. ఏపీలో ఒక్కసారిగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అలాగే జనాల మూడ్ ఏంటో పీకే టీం కి బాగా అర్ధమైంది అని అంటున్నారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో పీకే టీం ఇంకా ఎన్నికల వ్యూహకర్తగా వైసీపీకి పనిచేస్తే రేపటి రోజున పార్టీ ఓడితే ఆ నింద తమ మీద పడి తమ క్రెడిట్ అంతా కొట్టుకుని పోతుందని పరపతి నిల్ అవుతుందని భయపడుతోంది అని అంటున్నారు

దీంతో సాధ్యమైనంత వరకూ వైసీపీ గడప దాటేందుకే చూస్తోందని అంటున్నారు. నిజానికి పీకే టీం బాధ్యతలను రిషి అనే ఆయన చూస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ నేరుగా జోక్యం చేసుకోవడంలేదు. అంటే ప్రశాంత్ కిశోర్ కి ముందే తెలుసని అంటున్నారు. ఒక పార్టీ అధికారంలోకి వస్తే మరోసారి ఆ పార్టీని జనంలో నిలబెట్టలేమని కూడా తెలిసే పీకే తాను సైడ్ అయ్యారని అంటున్నారు. ఇపుడు రిషి టీం కూడా పూర్తిగా తెర వెనక్కి వెళ్ళాలని ఆలోచిస్తోంది అంటే వైసీపీ గెలుపు గురించి సలహాలు సరిగ్గా ఇవ్వలేని పీకే టీం ఓటమి వాసనలు పసిగట్టడంలో మాత్రం విజయవంతం అయిందని అంటున్నారు.

దాంతో పీకే తాను నిండా మునగకుండా తప్పుకునేందుకు సిద్ధపడుతోంది అని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక మాట ఉంది. పీకే టీం తోనే తాము అధికారంలోకి వచ్చామనుకుని అతి చేసి పీకే టీం కి పెద్ద పీట వేయడమే అసలైన తప్పిదం అంటున్నారు. క్యాడర్ లీడర్స్ అంతా కలిస్తే పార్టీ అని దాని వల్లనే తాము పవర్ లోకి వచ్చామని గురించకపోవడం వల్లనే వైసీపీకి ఇపుడు ఇన్ని పాట్లు అని అంటున్నారు. పీకే టీం ని నమ్ముకుని నిండా మునగడం వైసీపీ వంతు అవుతూంటే పీకే టీం సరైన టైం లో కాడె వదిలేసి తనను తాను గెలిపించుకునే పనిలో ఉంది అంటున్నారు.

ఏది ఏమైనా జనం నాడిని పట్టడం ఎవరి వల్లా కాదు కానీ పార్టీని క్యాడర్ మనసుని గెలుచుకోవడం ఎపుడూ అధినాయకత్వం చేతిలో ఉంటుంది. ఆ పని పక్కన పెట్టి నేల విడిచి సాము చేసిన ఫలితమే ఇపుడు వైసీపీకి కళ్ల ముందు కనిపిస్తోంది అని అంటున్నారు.

ఇక పీకే టీం ఇప్పటికైనా తప్పుకుంటే అది వైసీపీకి కూడా ఎంతో కొంత మేలు చేసేదే అని అంటున్న వారూ ఉన్నారట. పార్టీని నమ్ముకుని క్యాడర్ ని దగ్గరకు తీస్తే ఎన్నికల వేళ అయినా ఎంతో కొంత మేలు జరుగుతుందని అనే వారూ ఉన్నారట. మొత్తానికి పీకే టీం తనంతట తాను వెళ్లకపోయినా వెళ్ళిపోయ్తే బాగుణ్ణు అనే వారూ వైసీపీలో ఉన్నారని ఇన్సైడ్ టాక్.
Show comments
More