ఆ విషయంలో పవన్ మాత్రమే ఫ్యాన్స్ ని తృప్తిపర్చుతున్నాడు

Tap to expand
బాలీవుడ్ హీరోలు.. కోలీవుడ్ హీరోలు సంవత్సరానికి రెండు మూడు సినిమాలను విడుదల చేస్తున్నారు. రెండు మూడు సాధ్యం కాని హీరోలు కనీసం ఒక్క సినిమా అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ తెలుగు హీరోల్లో ఎక్కువ శాతం మంది ఏడాదికి ఒక సినిమాను కూడా విడుదల చేయలేక పోతున్నారు.

చిరంజీవి.. అల్లు అర్జున్.. ఎన్టీఆర్.. రామ్ చరణ్... మహేష్ బాబు.. ఇలా ఎంతో మంది హీరోలు ఏడాదికి ఒక సినిమాను విడుదల చేయాలని ఎంత గట్టిగా ప్రయత్నించిన వీలుపడడం లేదు. సీనియర్ స్టార్ హీరోలు యంగ్ స్టార్ హీరోలు మాత్రమే కాకుండా చిన్న హీరోలు కూడా ఏడాదికి ఒకటి రెండు సినిమాలను విడుదల చేయడంలో విఫలం అవుతున్నారు.


ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాల చొప్పున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.  ఒక వైపు జనసేన కార్యక్రమాలతో బిజీగా ఉన్నా కూడా మరో వైపు వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను ఆనందింపజేస్తున్నాడు.

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు చాలా తక్కువ వచ్చేవి.. ఏడాది రెండేళ్లకు ఒకటి అలా వచ్చేవి. కానీ ఇప్పుడు రీమేక్ లను ఎంపిక చేసుకుంటూ చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని సంతోషపెడుతున్నాడు. సినిమాల విడుదల విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులకు సంతృప్తి పరుచుతున్నాడు.

ముందు ముందు పవన్ కళ్యాణ్ నుంచి ఏడాదికి రెండు సినిమాలు వచ్చినా ఆశ్చర్యం లేదని సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు రాబోయే రెండు సంవత్సరాల్లో బ్యాక్ టు బ్యాక్ వచ్చే అవకాశాలున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Show comments
More