ప్రముఖ సింగర్ కు కరోనా పాజిటివ్

Tap to expand
కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటికే సినీ రంగాన్ని ఆవహించింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళికి ఇటీవలే కరోనా సోకింది. ఇలా చాలామంది సెలెబ్రెటీలకు ఈ వ్యాధి అంటుకుంది.

తాజాగా ప్రముఖ సింగర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ‘హాయ్ రబ్బా హాయ్’ ‘మసక మసక’ లాంటి ఆల్బమ్స్ తీసి సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది స్మిత. సింగర్ గానే కాదు.. నటిగా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. తాజాగా స్మితకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్మిత స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

‘తనకు కరోనా లక్షణాలు లేవని.. కానీ ఒళ్లునొప్పులు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. పాజిటివ్ వచ్చినట్లు తేలిందని’ స్మిత సోషల్ మీడియాలో వివరించింది.

తనతోపాటు తన భర్త శశాంక్ కు కూడా కరోనా వచ్చినట్లు స్మిత తెలిపారు. ఇంట్లోనే సేఫ్ గా ఉన్నప్పటికీ తమకు కరోనా వచ్చిందంటూ స్మిత వాపోయింది. త్వరలోనే కరోనాను జయించి ప్లాస్మా దానం చేస్తామని ట్వీట్ చేసింది.
Show comments