ఆస్కార్ విజేతలకు ప్రభుత్వ-పరిశ్రమ సత్కారం లేదా?

Tap to expand
ఆస్కార్ అవార్డుతో `నాటు నాటు`( ఆర్ ఆర్ ఆర్) విదేశాల్లో దేశం మీసం తిప్పింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకుని 75 భారతీయ చలన చిత్ర పరిశ్రమకి అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఆస్కార్ అనే కలని భారతీయ సినిమా నెరవేర్చింది. అందులోనూ ఓ తెలుగు సినిమాకు ఈ అవార్డు రావడంతో ఎంతో  ప్రత్యేకం. దేశం నుంచి అధికారికం నామినేట్ కానప్పటికీ దర్శకుడు రాజమౌళి వ్యక్తిగత కృషి కారణంగా మాత్రమే ఇది సాధ్యమైంది.

యావత్ దేశం ఎంతో గర్విస్తోన్న సందర్భమిది. ప్రధాని మోది నుంచి  సాధారణ ప్రేక్షకుడు వరకూ ఎంతో సగర్వంగా చెప్పుకునే గొప్ప క్షణాలు.  ఇక తెలుగు ప్రేక్షకాభిమానుల ఆనందానికైతే అవదుల్లేవ్. ఆస్కార్ అందుకుని స్వదేశంలో  ల్యాండ్ అయిన టీమ్ కి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలకడం... సన్మానించ డం వంటివి జరిగాయి. అన్ని భాషల పరిశ్రమల నుంచి శుభాకాంక్షల  వెల్లువ కనిపించింది.


మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అధికారికంగా ఎలాంటి సన్మానం అయినా ఉంటుందా? అన్నది చూడాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్..ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆస్కార్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి పనితనాన్ని కొనియాడారు. ఈ నేపథ్యంలో  ప్రభుత్వం తరుపున ఆ విజేతల్ని సత్కరించుకుంటే మరింత గౌరవంగా ఉంటుందన్న అభిప్రాయాలు పలువురు నుంచి  వ్యక్తం అవుతున్నాయి.

ఔత్సాహికుల్లో ఇలాంటి గౌరవమర్యాదలు మరింత  ఉత్సాహాన్ని నింపుతాయని చెబుతున్నారు. మరి ఆ రకంగా ప్రభుత్వాలు ఏమైనా ప్లాన్ చేస్తున్నాయా? అన్నది తెలియాలి.  ఇక తెలుగు చలన చిత్ర పరిశ్రమ్ నుంచి కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. తొలిసారి ఓ తెలుగు సినిమాకి  ఆస్కార్ గౌరవం దక్కింది కాబట్టి అధికారికంగా ఫిల్మ్  ఛాంబర్ తరుపున  సన్మానిస్తే బాగుంటుందని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.

మరి సినీ పెద్దలు ఆవిధంగా ఆలోచన చేస్తున్నారా? అన్నది తెలియాలి.  అలాగే అవార్డు అందుకుని ఇండియాకొచ్చినె వెంటనే ఆస్కార్ సంబంధించి ఓ స్టార్ హీరో పెద్ద ఈవెంట్ కూడా చేసి టీమ్ మొత్తాన్ని వ్యక్తిగతంగా సన్మానిస్తున్నట్లు  మీడియాలో ప్రచారం సాగింది. కానీ  మళ్లీ దీనిపై ఎలాంటి అప్ డేట్ లేదు. సెలబ్రిటీలంతా  సోషల్ మీడియా వేదికగా శుభాంకాక్షలు వెల్లువలా కురిపించారు. కానీ వ్యక్తిగతంగా ఓ వేదికపైకి  ఆహ్వానించి సన్మానించే దిశగా ఆలోచనే చేసినట్లు కనిపించలేదు. మరి ఆసల్యమైనా ఆదిశగానైనా పెద్దలు ఆలోచిస్తారేమో చూడాలి.
Show comments
More