జూనియర్ ఎన్టీయార్ ర్ వచ్చేస్తున్నాడా...నారా రోహిత్ కామెంట్స్ వెనక...?

Tap to expand

తెలుగుదేశం పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ సీట్లలో విజయం దక్కింది. దాంతో పార్టీ ఫుల్ స్వింగ్ లో ఉంది. అది కూడా తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర ఒక వైపు సాగుతున్న వేళ పార్టీకి సానుకూల ఫలితాలు రావ్డం అంటే క్రెడిట్ చాలా వరకూ యువ నేత తన ఖాతాలో వేసుకుంటున్నారు. పాదయాత్ర వల్లనే యూత్ అంతా టర్న్ అయి మూడు పట్టభద్రుల సీట్లలో టీడీపీని గెలిపించారు అని లోకేష్ బ్యాచ్ చెప్పుకుంటున్నారు.


ఇదిలా ఉంటే నారా ఫ్యామిలీలో ఉన్న హీరో రోహిత్ ఇపుడు నారా లోకేష్ తో పాదయాత్రలో కనిపించారు సత్యసాయి జిల్లాలో లోకేష్ పాదయాత్ర జరుగుతోంది. యాభైవ రోజుకు పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా లోకేష్ తో పాటు అడుగులు వేసిన నారా రోహిత్ యూత్ అంతా తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఏపీలో తెలుగుదేశం పార్టీకి అంతా శుభంగా ఉందని అన్నారు.


అదే విధంగా తెలుగుదేశం పార్టీ వరస విజయాలతో ఉంటే వైసీపీ డిఫెన్స్ లో పడింది అని ఆయన విశ్లేషించారు. సరిగ్గా ఈ టైం లోనే జూనియర్ ఎన్టీఆర్  కూడా టీడీపీకి మద్దతు ఇస్తారని ఆయన అన్నారు. అవసరం అయినపుడు జూనియర్ రాజకీయాల్లోకి వస్తారని నారా రోహిత్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

అంతే కాదు లోకేష్ పాదయాత్ర రానున్న రోజులలో ప్రభంజం అయి సాగుతుందని ఏపీలో అతి పెద్ద సంచలనమే క్రియేట్ చేస్తుందని రోహిత్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే జూనియర్ ఎన్టీయార్  రాజకీయాల్లోకి వస్తారని తప్పకుండా సరైన టైం లో ఆయన రానున్నాడు అంటూ రోహిత్ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.

జూనియర్ చూస్తే పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. ఆయన ఫోకస్ అంతా సినిమాల మీదనే ఉంది. అలాంటి టైం లో ఆయన అనవసరంగా రాజకీయాల్లోకి వస్తారా అన్నది ఎప్పటి నుంచో ఉన్న చర్చ. నిజానికి 2009లో జూనియర్ రాజకీయాలోకి వచ్చి ప్రచారం చేసి పెట్టారు.

అప్పటికి జూనియర్ వయసు పట్టుమని పాతికేళ్ళు కూడా లేవు. ఆ టైం లో ఆయన ప్రచారానికి వచ్చారు. ఒక విధంగా తన కెరీని ఫణంగా పెట్టి మరీ  రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తరువాత జూనియర్ మళ్లీ పాలిటిక్స్ వైపు తొంగి చూడలేదు. అటూ ఇటూ వారధిగా ఉన్న ఆయన తండ్రి నందమూరి హరిక్రిష్ణ కూడా చనిపోవడంతో జూనియర్ పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు.

అయితే ఇటీవల దివంగతులు అయిన తారకరత్న సైతం తమ్ముడు జూనియర్ రాజకీయాల్లోకి వస్తారని చెబుతూ వచ్చారు. ఇపుడు నారా రోహిత్ కూడా అదే మాట అంటున్నారు. పైగా లోకేష్ పాదయాత్రలో పాలుపంచుకుని ఆయన ఈ మాటలు అన్నారు. దీనికంటే ముందు లోకేష్ కూడా జూనియర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నారు.

దీనిని బట్టి చూస్తే వరస విజయాలు టీడీపీకి దక్కుతున్నా ఇంకా కొన్ని డౌట్లు అయితే వచ్చే ఎన్నికల్లో విజయం మీద ఉన్నాయని భావిస్తున్నారు. దాంతో  ఈసారి గట్టిగా పట్టుపట్టాలీ అంటే ఫ్యామిలీ టోటల్ గా దిగిపోవాలని డిసైడ్ అయినట్లుగా ఉంది. ఒక వైపు జనసేనాని పవన్ కళ్యాణ్ తో పొత్తులో ఉంటూనే జూనియర్ ని కూడా తమ వెంట రప్పిస్తే ఇక తమ విజయానికి తిరుగు ఉండదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఎవరైతే పిలిచి బొట్టు పెట్టి రమ్మనాలా అని ఎకసెక్కమాడారో ఇపుడు వారంతా కూడా జూనియర్ రావాలి అంటున్నారు. ఇది తెలుగుదేశంలో అధినాయకత్వం స్థాయిలో మార్పుగా అంతా చూస్తున్నారు. అయితే ఇటు వైపు నుంచి పిలుపులు ఉన్నా జూనియర్ మాత్రం రాజకీయాల పట్ల ప్రస్తుతానికి ఆసక్తిని చూపించరనే అంటున్నారు.

ఎందుకంటే ఇపుడు జూనియర్ తన కెరీర్ నే చూసుకుంటున్నారు. ఆయన కనీసం ప్రచారం కాదు కదా సానుకూలంగా ప్రకటనలు కూడా ఇచ్చే సీన్ అయితే లేదు అని సన్నిహిత వర్గాల నుంచి టాక్. కానీ టీడీపీ కానీ దాని మద్దతుదారులు కానీ జూనియర్ ఈ టైం లో వస్తేనే బెటర్ అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Show comments
More