నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో దసరా సినిమాని చేసిన సంగతి తెలిసిందే. నాని కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు.
మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ పై నాని ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఏదో రెగ్యులర్ గా ఐదు భాషల్లో ప్రెస్ మీట్ లు ఇచ్చేసి వచ్చేస్తే సరిపోతుంది అని కూర్చోకుండా స్ట్రాంగ్ ప్రమోషన్ చేస్తున్నారు.
ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఈ సినిమాని ఎక్కువ మందికి రీచ్ చేయడం కోసం గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్లి అక్కడ సోషల్ మీడియా సెన్సేషన్ అయిన వాళ్ళతో కలిసి ప్రమోషన్ చేస్తున్నారు. అలాగే స్టూడెంట్స్ తో కలిసి సందడి చేస్తున్నారు. ఇక సౌత్ లో కూడా నాలుగు రాష్ట్రాల్లో తిరిగేస్తూ ప్రేక్షకులకు తనను తాను పరిచయం చేసుకునే ప్రయత్నం నాని చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.
ఇతర స్టార్ హీరోలకు భిన్నంగా చాలా సహజమైన పద్ధతులలో ప్రేక్షకులకి ఎలా అయితే కనెక్ట్ కావచ్చు అనేది అంచనా వేరి ప్రమోషన్ చేస్తూ ఉండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
దసరా సినిమా హిందీ బెల్ట్ తో పాటు మిగిలిన సౌత్ రాష్ట్రాలలో సక్సెస్ అయితే మాత్రం కచ్చితంగా ఆ క్రెడిట్ మొత్తం నానికే దక్కుతుంది అని చెప్పాలి. మరి నాని చేస్తున్న ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ వర్క్ ఎంతవరకు సినిమాకి ప్రేక్షకులను రప్పిస్తుంది అనేది వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.