సానియా మీర్జాపై సంచలన కామెంట్స్ చేసిన 'నగ్నం' బ్యూటీ...!

Tap to expand
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'నగ్నం' సినిమాతో ఓవర్ నైట్ పాపులరైన బ్యూటీ స్వీటీ అలియాస్ శ్రీ రాపాక. 'నగ్నం' సినిమాలో మొహమాటం లేకుండా వర్మకి నచ్చినట్లు ఎన్ని డిఫెరెంట్ యాంగిల్స్ లో కెమెరా పెట్టినా అభ్యంతరం చెప్పకుండా అందాలు ఆరబోసి అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి శ్రీ రాపాక 'నగ్నం' సినిమాలో నటించకముందే ఇండస్ట్రీలో వర్క్ చేసింది. టాలీవుడ్ లో కాస్ట్యూమ్ డిజైనర్ గా ఎంతో మంది స్టార్ హీరోలతో కలసి పనిచేసింది. 'నగ్నం' సినిమాతో హాట్ టాపిక్ గా మారిన శ్రీపాక ఈ మధ్య పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ టెన్నిస్ సంచలనం సానియా మీర్జాపై సంచలన కామెంట్స్ చేసింది శ్రీరాపాక.

కాగా ఓ ఇంటర్వ్యూలో 'నగ్నం' సినిమాలో నటించడం గురించి శ్రీరాపాక మాట్లాడుతూ.. ''నేను ఈ సినిమాలో నగ్నంగా నటించలేదు. వర్మ అలా చూపించారు. చాలా సినిమాల్లో టవల్ కట్టి హీరోయిన్లను బోల్డ్ గా చూపించారు. 'ఆమె' సినిమాలో అమలాపాల్ బట్టలు లేకుండా చేసింది. ఇక నేను నగ్నంగా చేయలేదు కాబట్టి నేను ఎక్కడా బయపడలేదు. నా తొడలపై వర్మ ఫోకస్ పెట్టారు. అది నాకు పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు. ఎందుకంటే ఎలాగూ నేను ఫ్యాషన్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఇబ్బంది పడలేదు. నేను స్పోర్ట్స్ ఆడేటప్పుడు థైస్ కనిపించేలా బట్టలు వేసుకునేదాన్ని. పైగా నా థైస్ కి చిన్నప్పటి నుంచి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఆటలు ఆడుతుంటే నీ థైస్ బాగుంటాయని నా కొలీగ్స్ అనేవారు. స్పోర్ట్స్ ఆడుతుంటే కేవలం నా థైస్ చూడటం కోసం వచ్చేవాళ్లతో గ్యాలరీ నిండిపోయేది'' అని నవ్వేసింది.

అంతేకాకుండా ''స్పోర్ట్స్ ఆడేవాళ్లు ఎంతమంది థైస్ చూపించడం లేదు. సానియా మీర్జానే తీసుకోండి. పైన అన్నీ కనిపించేలా లోపల వేసుకున్న ఇన్నర్ కనిపించేలా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఆడుతుంది. ఇమె అలా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఇంటర్నేషనల్ లెవల్లో ఆడినా వల్గారిటీ కనిపించలేదు.. బోల్డ్ కనిపించలేదు. సానియా మీర్జా థైస్ కనిపించేలా పొట్టి నిక్కరు వేసుకుని లోపల ఇన్నర్ కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆమె అలా కొడుతుంటే చాలా కనిపించేవి.. అప్పుడు ఎవరూ మాట్లాడలేదు.. ఓన్లీ గేమ్ గురించే మాట్లాడారు. ఎందుకంటే అది స్పోర్ట్స్ కాబట్టి. ఇది సినిమా ఫీల్డ్ కాబట్టి ఏది చేసిన బోల్డ్ అంటున్నారు. ఏదైనా మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది'' అంటూ శ్రీరాపాక సంచలన కామెంట్స్ చేసింది.
Show comments