ఇటు బౌలింగ్.. అటు బ్యాటింగ్.. రెండూ మహీనే..

Tap to expand
ఐపీఎల్ సందడి మొదలవుతోంది. దేశంలో మళ్లీ క్రికెట్ ఫీవర్ ఊపందుకుంది. ఐపీఎల్ కు సంబంధించిన ప్రోమోలు ఆసక్తి రేపుతున్నాయి. దేశంలోనే ఈసారి ఐపీఎల్ జరుగబోతోంది. కరోనాతో ఒక యూఏఈలో మరోసారి ముంబైలో నిర్వహించిన ఈ పోటీలను ఈసారి అన్ని రాష్ట్రాల్లోని స్టేడియంలలో నిర్వహిస్తున్నారు.

ఐపీఎల్ దేశంలో మార్చి 31 నుండి ప్రారంభమవుతుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్ తన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. పోయిన సారి ఐపీఎల్ విజేతగా గుజరాత్ నిలిచింది.  


ఐపీఎల్  ప్రారంభ సన్నాహాలు మొదలయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా హ్యాండిల్ దాని సృజనాత్మక పోస్ట్లు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది

ప్రధానంగా ఎంఎస్ ధోనిపై దృష్టి పెడుతోంది. ధోని నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను సీఎస్కే షేర్ చేసింది. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోని బౌలింగ్ ప్రాక్టీస్కి సంబంధించిన కొత్త వీడియో ఉంది. ఇక ధోనినే ఆయన బౌలింగ్ కు బ్యాటింగ్ చేస్తున్నట్టుగా మార్ఫింగ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.  

'ది మల్టీవర్స్ ఆఫ్ మహి' అని క్యాప్షన్ ఇచ్చి ధోని బౌలింగ్ బ్యాటింగ్ రెండూ చేయగలడని సీఎస్కే సోషల్ మీడియా ఖాతాలో వీడియో షఏర్ చేశారు. ధోని ఊహించని రీతిలో బౌలింగ్ చేయడం ఇందులో అరుదైన దృశ్యంగా చెప్పొచ్చు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. బ్యాటింగ్ చేస్తున్న ధోనీని బౌలర్ ధోనీ కవ్విస్తున్నట్టుగా వీడియోను అద్భుతంగా క్రియేట్ చేశారు.  'మల్టీవర్స్' అనే పదం ట్రెండ్గా ఉంది. సీఎస్కే షేర్ చేసిన 'తలా' వీడియోపై అభిమానులను హర్షం వ్యక్తం చేస్తూ తెగ షేర్ చేస్తున్నారు.

ధోనీ ఈ ఏడాది ఐపీఎల్లో సీఎస్కే కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇది అతడికి చివరి సీజన్ అని పుకార్లు వినిపిస్తున్నాయి.

Show comments
More