కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లాలోనే సిరివెన్నెల పుట్టి పెరిగారు. సిరివెన్నెల తండ్రి యోగా మాష్టారు అంటే అనకాపల్లిలో తెలియని వారుండరు. ఆ తర్వాత శాస్ర్తి గారి సోదరులంతా విశాఖలోనే స్థిరపడ్డారు. సినిమా రంగంలోకి రావడంతో సిరివెన్నెల హైదరాబాద్ లో స్థిరపడ్డారు. కానీ విశాఖ..అనకాపల్లితో సిరివెన్నల అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఈ నేథ్యంలో ఆయన జ్ఞాపకార్ధం విశాఖలో స్థలం కేటాయించారు. సిరివెన్నెల ఆనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి ఖర్చులన్ని ప్రభుత్వమే భరించింది. తాజాగా ఇళ్ల స్థలం కేటాయించింది.
ఇప్పటికే విశాఖలోనూ సినీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సినీ పెద్దల్ని కోరిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి అన్ని రకాలు ప్రోత్సాహకాలు ఉంటాయని మాటిచ్చారు. ఇళ్ల స్థలాలు..స్టూడియోల నిర్మించుకునేందుకు ప్రైమ ఏరియాలో స్థలాలు ఇస్తామన్నారు. దీనిలో భాగంగా ఏపీలోనూ షూటింగ్ లకు అన్ని రకాల వెసులు బాట్లు కల్పించారు. సింగిల్ విండో విధానంలో షూటింగ్ లకు అనుమతులు ఇస్తున్నారు.