40 ఏళ్ల రాజకీయ అనుభవంలో చంద్రబాబు చెత్త స్టేట్ మెంట్ ఇదేనా?

Tap to expand
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం చంద్రబాబుదీ.. 1978 నుంచి ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ముఖ్యమంత్రిగా.. ప్రధాన మంత్రులను మార్చిచేసిన చరిత్ర చంద్రబాబుదీ.. ఎన్డీఏ చైర్మన్ గా ఇలాంటివి ఎన్నో పదవులు అధిరోహించిన రాజకీయ కురువృద్ధుడు అయిన చంద్రబాబు ఇంత చెత్త స్టేట్ మెంట్ ఇస్తాడని టీడీపీలోనే ఊహించలేదు అంట..  

అదేంటంటే.. ‘48 గంటలు ఏపీ సీఎంకి టైమ్ ఇస్తున్నా అని.. మూడు రాజధానులపై సవాల్ చేశాడని..’ అయితే 48 గంటల తరువాత ఏమీ చేస్తానో చెప్పకుండా మెచ్యురిటీ లేని స్టేట్ మెంట్ ఇచ్చాడని టీడీపీ మేధావులు అనుకుంటున్నారట.. ప్రతీ రాజకీయ పార్టీకి కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి. టీడీపీకి అమరావతి ఉంటే.. వైసీపీకి నవరత్నాలు.. అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ జగన్ ప్రాధాన్యత అంశాలుగా పెట్టుకున్నాడు.

జగన్ ప్రభుత్వం గద్దెనెక్కి 15 నెలలు కూడా కాలేదు. ఈలోగానే కరోనా టైంలో 151 సీట్స్ ఉన్న వైసీపీ పార్టీని రెఫరెండం అడగడం ఎంటి అని టీడీపీ వాళ్లే ఆశ్యర్య పోతున్నారట.. పోరాటం చేయవచ్చు దేనిపైన అయినా.. ప్రతిపక్షం ఉండేది పోరాటం చేయడానికే.. అంతేగానీ మారు చేసేది తప్పు.. మేమే చేసిందే రైట్ అని అడ్డంగా మాట్లాడడం కాదు చంద్రబాబు అని ఢిల్లీలో ఉన్న మీడియా వర్గాల వారు అంటున్నారు.  
 
అమరావతి కోసం పోరాటం చేయడంలో తప్పు లేదు.. ఎందుకంటే టీడీపీ వాళ్ల ప్రాధాన్యం అది కాబట్టి.. కానీ వైసీపీ వాళ్లను చాలెంజ్ చేసి రెఫరెండం అడగడం ఏంటని టీడీపీ వాళ్లే ప్రశ్నిస్తున్నారు. లోకేష్ పిల్ల  చేష్టల్లా చంద్రబాబు కూడా ట్రాప్ లో పడ్డాడని ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం కాపాడుకో  అని చంద్రబాబుకు టీడీపీ సీనియర్లు హితబోధ చేస్తున్నారని ఆ పార్టీలో టాక్ నడుస్తోంది.
Show comments