ఇంతకాలం కాంగ్రెస్ ను ఎంతవీలైత అంత దూరం పెట్టాలని కేసీయార్ అనుకున్నారు. నాన్ ఎన్డీయే నాన్ యూపీఏ పార్టీలతో మాత్రమే జట్టుకట్టాలని కేసీయార్ చాలాసార్లు చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వంలో జరిగిన ఏ కార్యక్రమానికీ కేసీయార్ హాజరుకాలేదు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అన్నట్లుగా కేసీయార్ మాట్లాడేవారు. అలాంటిది ఒక్కసారిగా రాహూల్ కు మద్దతుగా మాట్లాడుతుండటమే విచిత్రంగా ఉంది.
కాంగ్రెస్ కు మద్దతుగా కేసీయార్ ఢిల్లీకి వెళ్ళాలని అనుకుంటున్నట్లు సమాచారం. రాహూల్ కు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.
తమతో కలిసొచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని వెళ్ళాలని ఐక్య ఉద్యమాలు చేయాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన సమావేశం నిర్ణయించింది. రాహూల్ కు మద్దతుగా మాట్లాడటమే కాకుండా ఢిల్లీలో జరగబోయే యూపీఏ మద్దతుపార్టీల సమావేశంలో పాల్గొనాలని కూడా కేసీయార్ డిసైడ్ అయ్యారట.
కాంగ్రెస్ కు మద్దతుగా కేసీయార్ ఇప్పటికే మమతాబెనర్జీ అఖిలేష్ యాదవ్ నితీష్ కుమార్ తో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. చూస్తుంటే వీళ్ళని కూడా కేసీయార్ ఢిల్లీకి పిలిపించేట్లున్నారు. ముందు ఢిల్లీలో బీజేపీ వ్యతిరేక ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ ర్యాలీ తర్వాత దేశంలోని అన్నీ రాష్ట్రాల్లోను ఆందోళనలు చేయబోతున్నది.
తెలంగాణా వ్యవహారంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా ఢిల్లీ ర్యాలీలో మాత్రం కేసీయార్ పాల్గొనాలని డిసైడ్ అయినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి తాజా వ్యవహారశైలిని చూస్తుంటే కేసీయార్ రూటు మార్చినట్లే అనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.