అమెరికాలో దారుణ హత్య : జాగింగ్ కు వెళ్లి శవమై కనిపించిన భారత సంతతి పరిశోధకురాలు

Tap to expand
అమెరికాలో దారుణ హత్య జరిగింది. భారత సంతతికి చెందిన పరిశోధకులుని కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి చంపేశారు. టెక్సాస్ రాష్ట్రంలోని ప్లానో నగరంలో నివసిస్తున్న సర్మిస్త సేన్ .. ఆగస్టు 1న చిషోల్మర్ ట్రైల్ పార్క్ సమీపంలో జాగింగ్ చేస్తున్నారు. అక్కడ జాగింగ్ చేస్తున్న సమయంలో మాయమైన ఆమె ... లెగసీ డ్రైవ్ మార్చమన్ వే సమీపంలోని క్రీక్ ప్రాంతంలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

ఆ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సర్మిస్త సేన్ హత్య కేసుకు సంబంధించి 29 ఏళ్ల బకారి అభియోనా మోన్క్రీప్ ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడు కొల్లీన్ కౌంటీ జైలులో నిర్బంధించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. సర్మిస్తను హత్య చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

కాగా 43 ఏళ్ల సర్మిస్త సేన్ ఫార్మసిస్ట్ గా పని చేస్తున్నారు. మాలిక్యులర్ బయాలజీ విభాగంలో క్యాన్సర్ రోగుల కోసం పనిచేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక సహజంగానే అథ్లెట్ కావడంతో ఆమె ప్రతిరోజు తన పిల్లలు నిద్ర లేవడానికి ముందే జాగింగ్ చేయడానికి వచ్చేదని పోలీసులు చెప్పారు. ఆమె మరణంతో ఆమె కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
Show comments