భారత్ కు మద్దతుగా నిలిచిన ఇండియన్ అమెరికన్లు

Tap to expand
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో ఉండే ఇండియన్ కాన్సులేట్ పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి కలకలం రేపింది. రాడ్లు కర్రలతో బిల్డింగ్ తలుపులు కిటికీలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా కాన్సులేట్ ఆవరణలో రెండు ఖలిస్థానీ జెండాలను కూడా ఎగురవేశారు. అయితే ఆ జెండాలను ఆఫీసు సిబ్బంది వెంటనే తొలగించారు.  

ఇక ఈ దాడిని భారతీయ అమెరికన్లు తీవ్రంగా ఖండించారు. కాన్సులేట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే  తాజాగా ఖలిస్తాన్ మద్దతుదారులు చేసిన నిరసనను వ్యతిరేకిస్తూ భారతీయ అమెరికన్లు  భారత్ కు మద్దతు తెలిపారు. కాన్సులేట్ వద్ద జాతీయ జెండాలతో ప్రదర్శన చేపట్టారు.


భారీ సంఖ్యలో భారతీయులు రావడంతో అక్కడున్న పలువురు ఖలిస్తానీ మద్దతుదారులు వెనక్కి తగ్గారు. 'మీరు మా సోదరులు.. రండి మాతో కలవండి' అంటూ ఖలిస్తానీ మద్దతుదారులను కోరారు. దీంతో భారత్ కు వెన్నుదన్నుగా నిలబడ్డ ఎన్నారైలు భారతీయుల మనసు దోచుకున్నారు. ఖలిస్తానీ మద్దతుదారులకు పోటీగా వారు చేసిన పని వైరల్ గా మారింది.

ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆయన మద్దతుదారులను అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఖలిస్తానీ మద్దతుదారులు బ్రిటన్ కెనడా అమెరికాలోని రాయబార కార్యాలయాల వద్ద నిరసనకు దిగుతున్నారు.

ఇక వారం రోజుల నుంచి పంజాబ్ పోలీసుల కంటికి చిక్కకుండా అమృత్ పాల్ సింగ్ చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నారు. ఆయన లీలలు చాలా ఉన్నాయని పోలీసులు చెప్పారు.

తనకంటూ ఓ సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని.. ప్రత్యేకంగా కరెన్సీని రూపొందించుకున్నారని అంటున్నారు. ఖలిస్థాన్ దేశం కోసం ప్రత్యేకంగా ఓ జెండాను కూడా రూపొందించారని తెలిపారు.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Show comments
More