NTR అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ బడా నిర్మాతతో సినిమా?

Tap to expand
చాలాకాలం నుంచి ఎన్టీఆర్ అభిమానులను ఇబ్బంది పెడుతున్న అంశం మీద ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ కొట్టి చాలా కాలమైంది. కానీ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయం మీద కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ అభిమానులు మదన పడుతూ వచ్చారు. కొరటాల శివ ఆచార్య డిజాస్టర్ దెబ్బకు ఎన్టీఆర్ అభిమానులందరూ ఒకందుకు వణికిపోయిన పరిస్థితి కనిపించింది.

ఎట్టకేలకు కొరటాల శివ ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్ పనులన్నీ జాగ్రత్త గా పూర్తిచేసి  ఎట్టకేలకు సినిమా ప్రారంభోత్సవం కూడా జరిపారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకు మరో శుభవార్త లాంటి వార్త బయటకు వచ్చింది.


అదేమిటంటే బాలీవుడ్ ఫిలిం వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఎన్టీఆర్తో ఒక సినిమా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఆయన ఎన్టీఆర్ 30 ఈవెంట్కి కూడా హాజరవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదేంటి భూషణ్ కుమార్ ఎన్టీఆర్ 30 ఓపెనింగ్కి ఎందుకు వచ్చారు అని అందరూ ఆశ్చర్యపోయారు.

కానీ ఆయన ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నారనే విషయం తెలుసుకుని ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. వాస్తవానికి భూషణ్ కుమార్ ఇప్పటికే పలు తెలుగు సినిమాలను కూడా చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతున్న ప్రభాస్ ఆది పురుష్ సినిమాకు భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో అనౌన్స్ చేసిన సినిమా కూడా భూషణ్ కుమార్ నిర్మాణంలోనే తెరకెక్కుతోంది.

అదేవిధంగా సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన స్పిరిట్ సినిమాని కూడా ఆయనే  నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో ఆయన సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారనే వార్తతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో ఎన్టీఆర్ క్రేజ్ మరోసారి దేశవ్యాప్తంగా మారుమోగిపోవడం ఖాయమని వారు అంటున్నారు.
Show comments
More