సాదాసీదాగా ప్రధాని వివాహం

Tap to expand
ఫిన్ లాండ్ ప్రధాని సనా మారిన్ కరోనాతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు అది తగ్గదని తెలిసి పోయింది. తన చిరకాల స్నేహితుడు.. సాకర్ ఆటగాడు అయిన మార్కస్ రాయ్కెన్ ను ఫిన్ లాండ్ ప్రధాని వివాహమాడారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లి ఫొటోలను పోస్ట్ చేసి ప్రధాని తెలిపారు.

మారిన్ -మార్కస్ ల వివాహం ప్రధాని అధికారిక నివాసంలో అత్యంత నిరాడంబరంగా జరిగింది. వధూవరులతోపాటు కరోనా కారణంగా కేవలం 40మంది అతిథులు మాత్రమే పాల్గొన్నారు.

పదహారేళ్లుగా కలిసి ఉంటున్న వీరిద్దరికీ ఎమ్మా అమైలా మారిన్ అనే రెండేళ్ల కూతురు కూడా ఉంది. తమ 18వ ఏటనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. శనివారం పెళ్లితో ఒక్కటయ్యారు.

గత ఏడాది డిసెంబర్ లో ఫిన్ లాండ్ ప్రధానిగా సనా మారిన్ బాధ్యతలు చేపట్టారు. ప్రపంచంలోనే అత్యంత పిన్నవయసులో 34 ఏళ్లకే ప్రధాని పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డులకెక్కారు.
Show comments