అచ్చమైన తెలంగాణ యాసలో వస్తున్న సినిమా కావడం అక్కడక్కడ బూతులు మాట్లాడాల్సి రావడం వాటికి సెన్సార్ బోర్డు కత్తిరింపులు చేయడం అంతా ఓకే కానీ సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే పాయింట్ వద్ద సెన్సార్ కట్ చేయాలని చెప్పినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీని వల్ల సినిమాలో అసలైన ట్విస్ట్ పోతుందా అనేది తెలియాల్సి ఉంది.
సింగరేణి మైన్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే బలమైన తెలంగాణ ఆధారిత యాక్షన్ మూవీ డ్రామాగా దసరా తెరకెక్కింది. ఒకవైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని కీర్తి సురేష్ పడిపోయి దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. దసరా కోసం నాని వరుస పెట్టి ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. తన సినిమాపై వీలైనంతగా బజ్ క్రియేట్ అయ్యేలా చూసుకుంటున్నాడు నేచురల్ స్టార్.
అయితే ఇంటర్వ్యూల సమయంలో నాని తన గురించి తన సినిమా గురించి మాట్లాడుతున్న వ్యాఖ్యలు వార్తల్లో నిలుస్తున్నాయి. నిన్న కాక మొన్న తనను ఓ డైరెక్టర్ అవమానపరిచాడని నాని ఇలా అనగానే అతనెవరు ఎప్పుడు ఎందుకు అలా అన్నాడని సోషల్ మీడియాలో చర్చసాగింది. అలాగే కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలను సుకుమార్ ను కంపేర్ చేస్తున్నట్లు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి.
నాని కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి సముద్రఖని సాయి కుమార్ వంటి వారు కీలక పాత్రలో నటించారు. సత్యం సూర్య సినిమాటోగ్రఫీ అందించగా నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు.
మార్చి 30వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కానుంది దసరా మూవీ. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెద్ద పెద్ద సెంటర్లలో మాత్రమే వేస్తామని చిత్రబృందం చెబుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.