3వ రోజు కలెక్షన్స్.. దమ్ము చూపించిన ధమ్కీ

Tap to expand
మాస్ కా దాస్ విశ్వక్ సేన్  హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన రెండవ చిత్రం దాస్ కా ధమ్కీ. నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్షన్ చేసి... నిర్మాతగా కూడా వ్యవహరించారు. సొంతంగా విశ్వక్ సేన్ సినిమాస్ అనే బ్యానర్ ఏర్పాటు చేసి.. దానితోపాటు తన తండ్రి నిర్మాతగా వన్మయి క్రియేషన్స్ సినిమా కూడా ఈ నిర్మాణంలో పాలుపంచుకుంది.

ముందు నుంచి ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు విశ్వక్ సేన్. అలా మార్చి 22వ తేదీన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా  ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. విశ్వక్ కెరియర్లో మొదటి పాన్ ఇండియా సినిమాగా ధమ్కీ రిలీజ్ అయింది. తెలుగు కన్నడ మళయాళ తమిళ సహా హిందీ భాషల్లో విడుదల అయింది.


ఇక ఈ సినిమా మూడవరోజు వసూళ్ల విషయానికి వస్తే గట్టిగానే అందుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ కలిపి కోటి రెండు లక్షలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.

షేర్ మాత్రం కోటి 80 లక్షల వరకు వసూలు అయినట్లుగా చెబుతున్నారు. ఒక రకంగా చూస్తే శుక్రవారం నాడు ఈ సినిమా ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం మామూలు విషయం కాదు.

ఇక ఈ సినిమా మూడు రోజుల ప్రాంతాల వారి వసూళ్లు పరిశీలిస్తే.. నైజాం ప్రాంతంలో రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు  సీడెడ్ 73 లక్షల రూపాయలు ఉత్తరాంధ్ర అరవై నాలుగు లక్షలు రూపాయలు ఈస్ట్ గోదావరి 42 లక్షల రూపాయలు వెస్ట్ గోదావరి 26 లక్షలు రూపాయలు గుంటూరు 49 లక్షలు రూపాయలు కృష్ణ 33 లక్షలు నెల్లూరు 21 లక్షలు మొత్తం కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల 13 లక్షల షేర్ 9 కోట్ల 50 లక్షల గ్రాస్ వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలెక్షన్స్ పరిశీలిస్తే 6 కోట్ల 86 లక్షల షేర్ 13 కోట్ల 55 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఫ్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం ఇంకా కోటి 14 లక్షలు వసూలు చేస్తే సూపర్ హిట్ అవుతుంది సినిమా. ఈ సినిమా ఇప్పుడు మరింత ముందుకు దూసుకువెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈరోజు శనివారం రేపు ఆదివారం సెలవులు కలిసి రావడంతో కలెక్షన్స్ మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Show comments
More