వైరల్ అవుతున్న యంగ్ హీరో 'చైల్డ్ హుడ్' కౌబాయ్ పిక్..!

Tap to expand
ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభం నుంచీ హిట్ కోసం ప్రయత్నిస్తున్న యంగ్ హీరో అక్కినేని అఖిల్. ప్రస్తుతం అఖిల్ నాలుగో సినిమాగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రూపొందుతుంది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పై అక్కినేని ఫ్యామిలీ అక్కినేని అభిమానులు ఆశలు మాములుగా పెట్టుకోలేదు. వరుస ప్లాపులలో కూరుకుపోతున్న అఖిల్ ను బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఎంతవరకూ గట్టెక్కిస్తుందా.. అనేది సోషల్ మీడియాలో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. పూర్తి ఫన్ అండ్ ఎమోషన్స్ తో ఈ సినిమాను రూపొందించారని సమాచారం. ఇదిలా ఉండగా అఖిల్ చిన్నప్పటి పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో అఖిల్ కౌబాయ్ డ్రెస్సింగ్ స్టైల్ తో గన్ పట్టుకొని పోజిచ్చాడు.

అయితే ఆ పిక్ మహేష్ బాబు నటించిన టక్కరిదొంగ మూవీ షూటింగ్ సమయంలో సెట్స్ కు వెళ్ళినప్పుడు దిగిన పిక్ అని సమాచారం. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక 1995లోనే సిసింద్రీ సినిమాతో అఖిల్ సినీరంగ ప్రవేశం చేసాడు. ఆ తర్వాత మళ్లీ డైరెక్ట్ హీరోగా దర్శనమిచ్చాడు. ఇదిలా ఉండగా.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో మధ్య తరగతి యువకుడిగా కనిపించనున్నాడట. గీతా గోవిందం తరహాలో ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్ అని మేకర్స్ అంటున్నారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో ఈ సినిమా ఆగిపోయింది. లేకపోతే ఈపాటికి థియేటర్లలో విడుదల అయ్యుండేది. ఇక ప్రస్తుత పరిస్థితుల కారణంగా నిర్మాతలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Show comments