ఇప్పుడు సీసీఎల్ ఫార్మెట్ పూర్తిగా మారిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ తరహాలో టీమ్ లు జత కట్టి ఆడుతున్నాయి. అన్ని పరిశ్రమల నటులు కలిపి ఆడుతుండటంతో మునుపటంత క్రేజ్ కనిపించలేదు. ఈ మ్యాచ్ లకు దాదాపు స్టార్ హీరోలంతా దూరంగా ఉంటున్నారు. దీంతో ఇప్పటి మ్యాచ్ లకు అంతగా ఆదరణ దక్కలేదని వినిపిస్తుంది. 2023 సీసీఎల్ ఇప్పటికే సెమిస్ ని కూడా పూర్తి చేసుకుంది.
వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్ లకు ఆదరణ అంతంత మాత్రంగానే కనిపించింది. ఈ మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారం చేసిన ఛానెల్స్ కి పెద్దగా లాభమేమి చూకూరినట్లు లేదు. ముఖ్యంగా తెలుగు నుంచే పెద్దగా ఆదరణ దక్కలేదని వినిపిస్తుంది. తెలుగు వారియర్స్ జట్టులో టోర్నీకి కనువిందు చేసే ముఖం లేదు. ఆట సంగతి పక్కనబెడితే టీమ్ లో బ్రాండ్ ఇమేజ్ అనేది ఎక్కడా కనిపించలేదు.
తెలుగు వారియర్స్ టీమ్ లో చెప్పుకోదగ్గ నటుడు ఎవరైనా ఉన్నారు? అంటే అది అఖిల్ మాత్రమే జట్లులో ప్రధానంగా హైలైట్ అవుతున్నాడు. అయితే అఖిల్కి కూడా ఇలాంటి సిల్లీ టోర్నమెంట్లు ఆపేసి సినిమాలపై కాన్సంట్రేట్ చేయాలని ఫ్యాన్స్పై విపరీతమైన ఒత్తిడి కనిపిస్తుంది. అఖిల్ తాను హీరోగా నటిస్తోన్న `ఏజెంట్`ను హోల్డ్లో పెట్టి మరీ ఈ టోర్నమెంట్లో ఆడుతున్నాడు.
చిన్ననాటి నుంచి అఖిల్ కి క్రికెట్ పిచ్చి ఉంది. ఆ ఫ్యాషన్ తోనే సినిమాని సైతం పక్కనబెట్టాడు. లీగ్లోని అన్ని జట్లకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద స్టార్లు ఎవరూ కనిపించలేదు. ఆటగాళ్లు ఉన్నా! స్టార్లు లేకపోడంతో సీసీఎల్ వెల వెలబోతుంది అన్న విమర్శ వినిపిస్తుంది. వైజాగ్ లాంటి వేదికపైనే ఆదరణకి నోచుకోలేదు అంటే మిగతా రాష్ర్టాల్లో ఆదరణ మరింత కష్టమే. అందుకే రెండు సెమీస్ లను వైజాగ్ లో నిర్వహించారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది హక్కుల విలువ మరింత తగ్గుతుందని కొత్త ప్రచారం తెరపైకి వస్తుంది. దీంతో టీమ్ యజమానులు- నిర్వాహకులు నష్టాలు చూడాల్సి వస్తుంందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మరి 2024 నుంచైనా జాగ్రత్త పడతారేమో చూడాలి. నేటి సాయత్రం తుది పోరు కి భోజుపురి దబాంగ్స్- తెలుగు వారియర్స్ సిద్దమవుతున్నారు. వైజాగ్ వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.