అల్లు అర్జున్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్

Tap to expand
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'వరుడు' చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ భానుశ్రీ మెహ్రా తక్కువ సమయంలోనే టాలీవుడ్ నుంచి కనిపించకుండా పోయింది. ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్ ను నెట్టుకు వచ్చే   ప్రయత్నం చేసింది.. కానీ అక్కడ కూడా సక్సెస్ దక్కలేదు. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో ఏదో ఒక మార్గం ద్వారా ప్రేక్షకులకు చేరువ అయేందుకు ప్రయత్నించింది.

అందులో భాగంగా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ షేర్ చేయడం ద్వారా అభిమానులను అలరిస్తూ వస్తుంది. ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సోషల్ మీడియా ద్వారా చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్య గురించి వ్యాఖ్యలు చేసి చర్చనీయాంశమైంది.


భానుశ్రీ మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో వయసు అనేది నిజమైన సమస్య. ఒక వయసు వచ్చిన తర్వాత ఆడవారు కేవలం తల్లి పాత్రలకే పరిమితం కావాల్సి వస్తుంది. పురుషులకు వయస్సు వర్తించడం లేదు. వారి వయసుతో సంబంధం లేకుండా హీరో పాత్రలు చేస్తున్నారు. తనకంటే వయసులో చాలా చిన్న వారికి ప్రేమికుడిగా భర్తగా కనిపిస్తున్నారు. స్త్రీ యొక్క స్థాయిని.. విలువను వయసు లేదా ఆమె వైవాహిక స్థితి ఆధారంగా ఎలా నిర్ణయిస్తారు అంటూ ప్రశ్నించింది.

ఇక నుంచి అయినా ఈ పద్ధతికి స్వస్తి పలికితే మంచిదని ఆమె పేర్కొంది. ఎంతో మంది గొప్ప మహిళల కథలను ఫిలిం మేకర్స్ పట్టించుకోవడం లేదని.. వారందరి గురించి ప్రేక్షకులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని భానుశ్రీ అంది. వయసు పెరిగితే సినిమాల్లో అవకాశాలు రావడం లేదంటూ భాను శ్రీ చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు కొట్టి పారేస్తున్నారు.

నాలుగు పదులు.. ఐదు పదుల వయసులో కూడా ఎంతో మంది హీరోయిన్స్ నటించడం మీకు కనిపించడం లేదా అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. ప్రతిభ ఉంటే అవకాశాలకు కొదవ లేదు. బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాష సినిమా ఇండస్ట్రీల్లో కూడా వయసు పెరిగిన హీరోయిన్స్ కి మంచి అవకాశాలు లభిస్తున్నాయి.

కమర్షియల్ సినిమాల హీరోయిన్స్ పాత్రలకు మాత్రం వారికి కాస్త తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఈ విషయంపై ఎక్కువగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. అయితే మరి కొందరు మాత్రం భాను శ్రీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Show comments
More