సుశాంత్ మాజీ ప్రేయసి ఆసక్తికరమైన ఇన్స్టా పోస్ట్...!

Tap to expand
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ మరణం తర్వాత అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకిత లోఖండే తీవ్ర భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. 'పవిత్ర రిష్తా' అనే హిందీ సీరియల్ తో సుశాంత్ తో కలిసి బుల్లితెరకు పరిచయమయ్యారు అంకిత. ఈ క్రమంలో అంకితా లోఖండే - సుశాంత్ లు ప్రేమలో పడ్డారు. ఆరేళ్ల పాటు సజావుగానే సాగిన వీరి బంధంలో మనస్పర్థలు రావడంతో సుశాంత్ - అంకిత ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. అప్పటికే సినిమాలతో బిజీగా ఉన్న సుశాంత్ వేరే నటితో డేటింగ్ చేసారు. అయితే అంకిత - సుశాంత్ లు వీడిపోయాక కూడా మంచి స్నేహితులుగా కొనసాగారు. ఇక సుశాంత్ మరణం తర్వాత పోలీసుల విచారణకు హాజరైన అంకిత పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

కాగా మొదటి నుండి సుశాంత్ మరణానికి అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమనే వాదన వినిపిస్తూ వస్తున్న అంకిత లోఖండే.. ఇటీవల సుశాంత్ తండ్రి రియాపై పాట్నాలో ఫిర్యాదు చేసిన తర్వాత తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి ''నిజం గెలుస్తుంది'' అని పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలో బీహార్ పోలీసుల విచారణలో సుశాంత్ గురించి తన స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు లేటెస్టుగా సోషల్ మీడియా వేదికగా సి. అరా కాంప్ బెల్ కొటేషన్ షేర్ చేసింది అంకిత. "ఈ జీవితకాలంలో నేను ఒక మిలియన్ విషయాలు కావాలని వారు కోరుకున్నారు. ప్రతి ఒక్కరికి నేను నమస్కరించి చెప్తున్నాను.. 'నేను ప్రీస్టెస్ మార్గంలో ఉన్నాను దేవత పుట్టింది మరియు నన్ను దూరం చేయలేరు. నేను నా హృదయ ప్రయాణాన్ని అనుసరిస్తాను. నన్ను కొనలేను.. నన్ను అమ్మలేను'' అని పోస్ట్ పెట్టింది.
Show comments