'సైరా' తర్వాత 'ఆర్ఆర్ఆర్' లో భాగమతి

Tap to expand
బాహుబలి చిత్రం తర్వాత ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా అనుష్క మారిపోతుందనుకుంటే పరిస్థితి తారుమారు అయ్యింది. కొన్ని కారణాల వల్ల అనుష్క గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం 'నిశబ్దం' అనే చిత్రంలో నటిస్తుంది. ఇదే సమయంలో అనుష్క కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇస్తోంది. ఇప్పటికే 'సైరా' చిత్రంలో జాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కొన్ని నిమిషాల పాటు అలరించింది. సైరాలో ఉన్నది కొద్ది సమయమే అయినా తనదైన ముద్రను అనుష్క వేసింది.

సైరా తర్వాత మరో పెద్ద సినిమాలో అనుష్క గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్.. ఎన్టీఆర్ లు నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తో పాటు ఇంకా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఇంతటి స్టార్ కాస్ట్ ఉన్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో అనుష్కను కూడా భాగస్వామి చేయాలని రాజమౌళి భావిస్తున్నాడట.

రాజమౌళి తన సినిమాలో కావాలని పాత్రలను సృష్టించడు. కథానుసారంగానే పాత్రలు క్రియేట్ చేస్తాడు. అలా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఒక చిన్న పాత్రకు అనుష్క అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నాడట. రాజమౌళితో అనుష్కకు ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ గురించి ఎన్నో ఇలాంటి వార్తలు వచ్చాయి. వాటిలో ఏది నిజం ఏది అబద్దం అనే విషయంపై యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు. మరి అనుష్క గెస్ట్ అప్పియరెన్స్  విషయమై ఎలా స్పందిస్తారో చూడాలి.
Show comments