కిరాక్ ఔట్ ఫిట్ లో కృతి శెట్టి..!

Tap to expand
కృతి శెట్టి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒక్క రాత్రిలోనే టాప్ హీరోయిన్ అయిపోయి.. వరుస సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. శ్యామ్ సింగరాయ్ బంగార్రాజు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ది వారియర్ మాచర్ల నియోజకవర్గం కస్టడీ చిత్రాల్లో నటించి మెప్పించింది.

కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పుడూ అభిమానులకు టచ్ లోనే ఉంటుందీ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో కృతి చాలా అందంగా కనిపిస్తోంది. బ్లాక్ డ్రెస్ లో ఈ బ్యూటీ మరింత అందంగా మెరిసిపోతోంది.


కృతి ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే పది లక్షలకు పైగా లైకులు వచ్చాయి. వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. బ్లాక్ డ్రెస్ విత్ బ్లాక్ షూస్ వేసుకొని కృతి కిరాక్ లుక్ లో దర్శనం ఇచ్చింది. అది చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. నీ అందాన్ని చూసి తట్టుకోలేక పోతున్నామంటూ చెబుతున్నారు.

బ్లాక్ అండ్ బ్లాక్ లో తెల్లటి చర్మంతో చీకట్లో జాబిలమ్మలా మెరిసిపోతోంది. లైట్ మేకప్ విత్ లైట్ లిప్ స్టిక్ వేసుకొని చాలా హాట్ గా చూస్తోంది. ఈ హాట్ ఫొటోలు చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. క్యూట్ నెస్ అండ్ హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక్క ఇన్ స్టా వేధికగానే కృతి శెట్టికి 5.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ క్యూట్ బ్యూటీ 148 పోస్టులను షేర్ చేసింది.  

ఇటీవలే ఈ ముద్దుగుమ్మ మాచర్ల నియోజకవర్గం ది వారియర్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తొలి సినిమా కోసం 6 లక్షక్షల రూపాయల పారితోషికం తీసుకున్న ఈమె.. ప్రస్తుతం 60 లక్షల రెమ్యునరేషన్ పుచ్చుకుంటుందట. ఇది చూస్తేనే అర్థం అవుతోంది ఆమె కెరియర్ ఏ రేంజ్ లో దూసుకెళ్తుందనేది.
Show comments
More