భూకంపమంటే అంత సరదాగా ఉందా అమ్మడు!

Tap to expand

ప్ర‌కృతి ప్ర‌కోపిస్తే ప‌రిస్థితి ఎలా? ఉంటుంద‌న‌డానికి ఎన్నో ఉదాహ‌ర‌ణాలున్నాయి. మొన్న‌టి క‌రోనా..నిన్న‌టి ట‌ర్కీ-సిరియా భూకంపాలు. అంత‌కుముందు గుజ‌రాత్ ..అస్సా భూకంపాలు. ఒరిస్సా తుపాన్లు. వైజాగ్ హుద్ హుద్ లు! ఇలా చెప్పుకుంటే పోతే ప్ర‌పంచ వినాశ‌నం ఎలా జ‌రుగుతుందో ముందే గెస్ చేయోచ్చు.


ఇలాంటి  భ‌యాన‌క ప‌రిస్థితులు రాకూడ‌ద‌ని దేవుళ్ల‌ని వేడుకుంటాం. అప్ప‌డ‌ప్పుడైనా స‌న్మార్గంలో న‌డ‌వాల‌ని అనుకుంటాం. కానీ ఈ బ్యూటీకి ఇవేం  ప‌ట్ట‌లేదు. భూకంపం వ‌చ్చే ముందు ఎంతో ఎగ్టైట్ మెంట్ కి గురైంది. వ‌స్తే ఎలా ఉంటుంద‌ని మ‌న‌సు ఉవ్విళ్లూరింది.


ఒక్క సారైనా చూద్దం విప‌త్తు ఎలా ఉంటుందో? అన్న త‌ర‌హాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వినాశ‌నానికి ఎంతో గ్రాండ్ గా వెల్క‌మ్ ప‌లికే ప్ర‌య‌త్నం చేసింది.  నెటి జ‌నుల‌కు..ట్రోల‌ర్ల‌కు అడ్డంగా దొరికింది. ఇంత‌కీ ఎవ‌రా న‌టి?  అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

ఇటీవ‌ల చండీఘ‌ర్ స‌హా భార‌త్ లో ప‌లు ప్ర‌దేశాల్లో  భూమి కంపించే స‌మ‌యంలో ప్ర‌జాలంతో  రోడ్ల‌పైకి ప‌రుగులు తీసిన సంగ‌తి తెలిసిందే.  రాత్రి స‌మ‌యంలో చోటు చేసుకోండ‌తో! అంతా ఆందోళ‌న‌కి గుర‌య్యా రు.  ప్ర‌జ‌లంతా  రోడ్ల‌పైకి ప‌రుగులు తీసారు. కానీ టెలివిజన్ నటి దివ్యాంక త్రిపాఠి ఆస‌న్నివే శాన్ని వీడి యో  తీసింది.' భూకంపాన్ని తొలిసారి చూస్తున్నాను.  

ఎంతో ఎగ్టైట్ గా ఉన్నాను.  కానీ మీకు ఇలా అనిపించదు. కెమెరాని త‌న భ‌ర్త వైపు తిప్పుతూకానీ  కాదా? హ‌ని అని అంది. 'యహాన్ పే పూరీ గలీ.. మొహల్లా నీచే ఆగ్యే హై. జబ్ తక్ జైదా నహీ హోతా. అంటూ వీడియో మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కూ న‌వ్వుతూ క‌నిపించింది.  ఆ వీడియోని  దివ్యాంక ట్విట్టర్ లో షేర్ చేసింది.

ప్ర‌జ‌లంతా బ్ర‌తికి బ‌ట్ట‌క‌ట్టాల‌ని ఆందోళ‌న‌కి గుర‌వుతుంటే ఈ అమ్మ‌డు మాత్రం వీడియో తీయ‌డం.. అందులో న‌వ్వుతు క‌నిపిచండం..దాన్ని సోష‌ల్ మీడియా లో పోస్ట్ చేయ‌డం వంటివి అమ్మ‌డికి పెద్ద కుంప‌టే తెచ్చిపెట్టాయి. దీంతో ఒక్క‌సారిగా ట్రోలర్స్  ఎటాకింగ్ కి  దిగారు. నెటిజ‌న‌లు త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తూ  కామెంట్లు  పోస్ట్ చేసారు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

 
 
 
Show comments
More